HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Coronavirus News
  • >Again Covid 19 Cases Increase In China Know Details Inside

Covid-19: డ్రాగన్‌పై మళ్ళీ బుసలు కొడుతున్న వైరస్‌!

Covid-19: కరోనా మహమ్మారి డ్రాగన్‌ కంట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మళ్లీ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

  • Author : Naresh Kumar Date : 31-10-2022 - 9:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Union Health Ministry
Union Health Ministry

Covid-19: కరోనా మహమ్మారి డ్రాగన్‌ కంట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మళ్లీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. జీరో కోవిడ్‌ విధానం అమలు చేస్తున్నా.. వైరస్‌ విరుచుకుపడుతూనే ఉంది. రోజువారీ కేసులు 80 రోజుల గరిష్టానికి చేరాయి. ఒక్కరోజే 2 వేల 500 పాజివిట్‌ కేసులు నమోదయ్యాయి. హెనాన్‌ ప్రావిన్స్‌ రాజధాని జెంగ్‌జౌలోని అతిపెద్ద ఐఫోన్‌ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్‌.. కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. దీంతో ఆ ప్రాంతాన్ని లాక్‌డౌన్‌ చేశారు అధికారులు.

ఓవైపు వైరస్‌, మరోవైపు ఆంక్షలకు భయపడి వందలాది మంది కార్మికులు.. ఫ్యాక్టరీ నుంచి బయటపడేందుకు పరుగులు పెడుతున్నారు. కంచెలు దూకి మరీ పారిపోతున్నారు. రోడ్లపై ట్రెక్కింగ్‌ చేసుకుంటూ.. స్వస్థలాలకు పయనమవుతున్నారు. కాగా.. ప్రపంచంలోని సగం ఐఫోన్‌లు ఈ ఫాక్స్‌కాన్‌లోనే తయారవుతాయి. ఇక్కడ దాదాపు 3 లక్షల మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తారు.

అక్టోబర్‌ 29 నాటికి సెంట్రల్‌ సిటీ ఆఫ్‌ జెంగ్‌జౌలో 167 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేవలం వారం రోజుల్లోనే 97 కేసులు పెరిగాయి. వైరస్‌ నియంత్రణ కోసం జీరో కోవిడ్‌ విధానాన్ని అమలు చేస్తోంది చైనా ప్రభుత్వం. ఒక్క కేసు వచ్చినా.. ఆ ప్రాంతం మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేసేస్తోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. దీనిపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా జిన్‌పింగ్ ప్రభుత్వం మాత్రం అసలు వెనక్కి తగ్గడంలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • corona virus
  • covid cases
  • covid-19

Related News

India tops global list of young entrepreneurs

యువ పారిశ్రామికవేత్తల గ్లోబల్ జాబితాలో భారత్ అగ్రస్థానం

40 ఏళ్లలోపు వయసు కలిగి, వంద మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ‘సెంటీమిలియనీర్ల’ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

  • Chinese Researchers Develop Eye Surgery Robot

    రోబో తో కంటి సర్జరీ

  • Norovirus outbreak in China, over a hundred students fall ill

    చైనాలో నోరో వైరస్ కలకలం..వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థత

Latest News

  • సుకుమార్ – రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘పుష్ప’ కెమెరామెన్‌కే బాధ్యతలు!

  • ఫామ్‌లోకి వ‌చ్చిన టీమిండియా.. ఒకే బంతికి 11 ప‌రుగులు!

  • న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం.. టీమిండియా సంచలన వరల్డ్ రికార్డ్!

  • ప్రసవం తర్వాత పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి?

  • మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

Trending News

    • 8వ వేత‌న సంఘం.. ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?

    • గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ

    • సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ

    • జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్‌పై బయటకొచ్చిన ఖైదీలు

    • బీసీసీఐకి త‌ల‌నొప్పిగా మారిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd