Yatra 2 : జగన్ బయోపిక్ యాత్ర 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందే..
మహి రాఘవ దర్శకత్వంలో జీవా హీరోగా యాత్ర 2 సినిమా జగన్ బయోపిక్ గా తెరకెక్కుతుంది.
- By News Desk Published Date - 11:34 AM, Sun - 8 October 23
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) బయోపిక్ గా మహి రాఘవ(Mahi Raghava) దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా యాత్ర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2019 లో ఎలక్షన్స్ ముందు ఈ సినిమా రిలీజ్ అవ్వగా మంచి విజయం సాధించింది. ఈ సినిమా అటు జగన్ కి కూడా ప్లస్ అయింది. దీంతో మళ్ళీ అయిదేళ్ల తర్వాత ఎలక్షన్స్ టైంకి యాత్ర 2(Yatra 2) సినిమాని ప్రకటించారు.
మహి రాఘవ దర్శకత్వంలో జీవా హీరోగా యాత్ర 2 సినిమా జగన్ బయోపిక్ గా తెరకెక్కుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ పరిస్థితులు, ఎలా సీఎం అయ్యాడు అనే అంశాలతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ మొదలై శరవేగంగా సాగుతుంది. రేపు యాత్ర 2 ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనున్నారు. అంతకుముందే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించాడు దర్శకుడు.
08-02-2019
08-02-2024— Mahi Vraghav (@MahiVraghav) October 7, 2023
మహి రాఘవ తన ట్విట్టర్ లో 2019 లో యాత్ర సినిమా విడుదలైన డేట్ పెట్టి మళ్ళీ అదే డేట్ కి 2024లో యాత్ర 2 రిలీజ్ అవుతుందని కేవలం డేట్స్ మాత్రమే పోస్ట్ చేసి ఇండైరెక్ట్ గా చెప్పాడు. 2019 ఫిబ్రవరి 8న యాత్ర సినిమా రిలీజవ్వగా 2024 ఫిబ్రవరి 8న యాత్ర 2 సినిమా రిలీజ్ చేయనున్నారు. ఏపీలో మార్చ్ లేదా ఏప్రిల్ లో ఎలక్షన్స్ జరగనున్నాయి. కరెక్ట్ గా మళ్ళీ ఎలక్షన్స్ ముందే ప్లాన్ చేయడంతో ఈ సినిమా జగన్ కి ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.
Also Read : Akhanda 2 : ఏపీ ఎలక్షన్స్ తర్వాతే అఖండ 2.. క్లారిటీ ఇచ్చిన బోయపాటి..
Related News
YS Jagan Guntur Tour: గుంటూరు జైలులో వైఎస్ జగన్, టీడీపీ రెడ్బుక్పైనే దృష్టి
YS Jagan At Guntur Jail: ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని, ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, టీడీపీ అవలంబిస్తున్న ఇదే సాంప్రదాయం ఒక సునామీ అవుతుందని హెచ్చరించారు.