Yash Remuneration : 100 కోట్ల రెమ్యునరేషన్ తో K.G.F హీరో..!
Yash Remuneration అంతకుముందు కన్నడలో స్టార్ హీరోగా ఉన్న యష్. కె.జి.ఎఫ్ తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
- By Ramesh Published Date - 10:05 AM, Mon - 23 October 23

Yash Remuneration అంతకుముందు కన్నడలో స్టార్ హీరోగా ఉన్న యష్. కె.జి.ఎఫ్ తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో తెరకెక్కిన కె.జి.ఎఫ్ సినిమాలో యష్ నటన అతనికి పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్ ఏర్పరచింది. కె.జి.ఎఫ్ 1, 2 తర్వాత యష్ నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కె.జి.ఎఫ్ రెండు ఫ్రాంచైజ్ ల తర్వాత యష్ ఈమధ్యనే ఓ సినిమా అనౌన్స్ చేశాదు. దీనితో పాటుగా బాలీవుడ్ లో తెరకెక్కే రామాయణ కథతో ఈ సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
నితీష్ తివారి (Nitish Tiwari) డైరెక్షన్ లో తెరకెక్కే రామాయణ (Ramayana) సినిమాలో రావణాసుర పాత్రలో యష్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో నటించేందుకు గాను యష్ (Yash) భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. సినిమా బడ్జెట్ లో సగానికి పైగా స్టార్స్ రెమ్యునరేషన్ ఉంటుందని తెలుస్తుంది.
సినిమాలో యష్ నటించేందుకు 100 కోట్ల దాకా పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తుంది.యష్ ఇదివరకు చేసిన సినిమాల కన్నా ఈ సినిమాకు ట్రిపుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. యష్ చేస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటుంది. దీనితో పాటుగా కె.జి.ఎఫ్ 3 (K.G.F-3)సినిమా కూడా నటిస్తున్నాడు యష్.
ప్రశాంత్ నీల్ సలార్ 1 పూర్తి చేశాక కె.జి.ఎఫ్ 3 ని మొదలు పెట్టాడతాడని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ 3, రామాయణ ఈ రెండు సినిమాలకు ఒకేసారి యష్ డేట్స్ ఇస్తాడని తెలుస్తుంది. యష్ హీరోగా కన్నడలో రెండు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉండగా బాలీవుడ్ లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు కూడా భారీ హైప్ ఏర్పడుతుంది. యష్ తెలుగు సినిమా కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక క్రేజీ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.
Also Read : Bigg Boss 7 : పూజా ఔట్.. రతిక ఇన్..!