Pushpa 2: ‘పుష్ప2’ లో సాయి పల్లవి నటిస్తుందా?
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప విజయం సాధించిన సంగతి తెలిసిందే.. బన్నీని ప్యాన్ ఇండియా స్టార్ ని చేసింది ఈ సినిమా.
- By Maheswara Rao Nadella Published Date - 01:15 PM, Wed - 8 March 23

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప (Pushpa) విజయం సాధించిన సంగతి తెలిసిందే.. బన్నీని ప్యాన్ ఇండియా స్టార్ ని చేసింది ఈ సినిమా. ఇప్పుడు పుష్ప (Pushpa) సీక్వెల్ పనుల్లో ఇద్దరూ బిజీగా ఉన్నారు. తొలి పార్టు సక్సెస్ ను దృష్టిలో ఉంచుకొని రెండో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించాలని సుకుమార్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం పార్ట్2 షూటింగ్ లో బన్నీ, సుకుమార్ బిజీగా ఉన్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. రెండో పార్టులో దక్షిణాది ప్రముఖ నటి సాయి పల్లవి ఓ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కథ, తన పాత్ర నచ్చితేగాని సినిమా అంగీకరించని సాయి పల్లవి ఒప్పుకుందంటే ఆమె కీలక పాత్ర చేస్తోందనే అనుకోవాలి. దాంతో, సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
Also Read: Elephant: ఏనుగు మామూళ్లు వసూలు చేయడం చూసారా..?

Related News

Actress Laya: నటి లయ అమెరికాలో ఎంత శాలరీ కి పని చేసిందో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి హీరోయిన్ లయ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.