Elephant: ఏనుగు మామూళ్లు వసూలు చేయడం చూసారా..?
దారి దోపిడీల గురించి విన్నారా.. ఒక ఏనుగు ఇలాంటి పనే చేస్తోంది. దారికాచి తనకు కావాల్సిన ఆహారాన్ని అధికారికంగా దోచుకుంటోంది.
- By Maheswara Rao Nadella Published Date - 12:45 PM, Wed - 8 March 23

దారి దోపిడీల గురించి విన్నారా ..ఒక ఏనుగు (Elephant) ఇలాంటి పనే చేస్తోంది. దారికాచి తనకు కావాల్సిన ఆహారాన్ని అధికారికంగా దోచుకుంటోంది. ఇందుకు సంబంధించి ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. థాయిల్యాండ్ లో కనిపించిన ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది.
ఓ ఏనుగు (Elephant) రహదారి పక్కనే నుంచుని వచ్చి, పోయే వాహనాలను గమనిస్తోంది. చెరకు లోడ్ తో వస్తున్న లారీని చూడడం ఆలస్యం.. రోడ్డు మధ్యకు వచ్చి ఆ వాహనాన్ని అడ్డుకుంటోంది. డ్రైవర్ వాహనం బ్రేక్ వేయడం ఆలస్యం.. లారీపై కనిపిస్తున్న చెరకు గడలను తొండానికి పట్టినన్ని తీసుకుని కింద పడేసి తినడాన్ని చూడొచ్చు. అదే దారిలో కార్లు, ఇతర వాహనాలు వెళుతుంటే రోడ్డు పక్కనే ఉంటున్నఏనుగు.. చెరకు లోడ్ తో వాహనం వస్తే చాలు.. దారికాచి చెరకు దోపిడీ చేస్తోంది. డాక్టర్ ఆజ్యయితా ఈ వీడియోని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసి.. రోడ్డు పన్ను వసూలుదారు అనే క్యాప్షన్ తగిలించారు. చాలా నిజాయతీపరుడైన పన్ను వసూలు దారు అంటూ ఓ యువతి కామెంట్ చేసింది. ఎందుకంటే ఈ ఏనుగు (Elephant) లారీ నుంచి కేవలం కొన్ని చెరకు గడలనే తీసుకుంటోంది ఈ ఏనుగు!
Also Read: Vizag to Goa: 2 గంటలలో వైజాగ్ నుంచి గోవా..

Related News

Arif & Sarus: ఆరిఫ్.. కొంగ.. హాట్ టాపిక్ గా మారిన ఒక అనుబంధం
భారీ కొంగను కాపాడి.. దానితో స్నేహం చేస్తూ ఇటీవల వార్తలకు ఎక్కాడు ఉత్తరప్రదేశ్ లోని అమేథీ జిల్లా మంద్ఖా గ్రామానికి చెందిన ఆరిఫ్ ఖాన్ గుర్జార్.