Malavika Mohanan : మాళవిక ‘చిరు’ కోరిక తీరేనా..?
Malavika Mohanan : మాళవిక మోహనన్ స్పష్టమైన ప్రకటనతో తాజాగా వచ్చిన కథానాయిక సంబంధిత రూమర్స్‌కు తెరపడింది. అయితే, దీంతో ఇక అసలు హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత పెరిగింది
- Author : Sudheer
Date : 29-10-2025 - 3:30 IST
Published By : Hashtagu Telugu Desk
మెగాస్టార్ చిరంజీవి–దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘మెగా 158’ సినిమా గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా మాళవిక మోహనన్ ఎంపికైందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తించాయి. అయితే, ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నటి మాళవిక స్వయంగా స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె, “చిరంజీవి గారితో పని చేయాలని ఎంతో కోరిక ఉన్నా, ప్రస్తుతం నేను ఆ ప్రాజెక్ట్‌లో లేను” అంటూ వదంతులకు ముగింపు పలికారు.
Jupally Krishna Rao : జూపల్లి ని దెబ్బ తీయాలని చేస్తుందేవరు..?
‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మరోసారి చిరంజీవి, బాబీ జోడి కట్టడంతో అభిమానుల్లో ‘మెగా 158’పై భారీ హైప్ నెలకొంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుందనే సమాచారం రావడంతో ఆసక్తి మరింత పెరిగింది. కథ వివరాలు బయటకు రాకపోయినా, సినిమా కాన్సెప్ట్, టెక్నికల్ టీమ్, మ్యూజిక్ వంటి విషయాలపై టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరు? ఆమె ఎప్పుడు ప్రకటిస్తారు? అంటూ నెట్‌ఫ్యాన్స్ ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
మాళవిక మోహనన్ స్పష్టమైన ప్రకటనతో తాజాగా వచ్చిన కథానాయిక సంబంధిత రూమర్స్‌కు తెరపడింది. అయితే, దీంతో ఇక అసలు హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత పెరిగింది. నిర్మాతలు, చిత్ర బృందం త్వర్వలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ తదుపరి చిత్రం కావడంతో, హీరోయిన్‌గా ఎవరైనా స్టార్ హీరోయిన్ ఎంపికయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండటంతో ప్రతి అప్డేట్‌పై అభిమానులు కన్నేసి ఉన్నారు. సినిమా రెగ్యులర్ షూట్ కూడా త్వరలో ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.