Ram Charan & Jr NTR: ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటకు చరణ్- ఎన్టీఆర్ డాన్స్ ఎందుకు చెయ్యలేదంటే!
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు అందులోని నాటు నాటు (Naatu Naatu) కూడా అంతకుమించి ఆకట్టుకుంది.
- Author : Balu J
Date : 15-03-2023 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan & Jr NTR) కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు అందులోని నాటు నాటు (Naatu Naatu) కూడా అంతకుమించి ఆకట్టుకుంది. ఈ పాట ఇండియాలోనే విదేశాల్లోనూ దుమ్మురేపింది. అయితే ఆస్కార్ స్టేజీపై నాటు నాటు డాన్స్ ఫర్పామెన్స్ ఉంటుందనీ, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఆ పాటకు స్టెప్పులు వేస్తారని ప్రతిఒక్కరూ ఆశించారు. కానీ ఇద్దరు స్టార్స్ డాన్స్ లేకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. మ్యాజిక్ స్టెప్పులు ఎందుకు మిస్ అయ్యాం అని చాలామంది అప్ సెట్ అయ్యారు.
మొదట్లో ఇద్దరు నటీనటులు రామ్ చరణ్, ఎన్టీఆర్ (Ram Charan & Jr NTR) డ్యాన్స్ చేస్తారని భావించారు. ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి ముందు రిహార్సల్ చేయడానికి అన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు స్టార్స్ రాకపోవడానికి బలమైన కారణం ఉందట. ఆస్కార్‌లో ప్రదర్శన ఇవ్వలేకపోవడానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ ముందస్తు కమిట్‌మెంట్లే కారణమని నిర్మాత రాజ్ కపూర్ వెల్లడించారు.
ఫిబ్రవరి చివరలో, తారలు (Ram Charan & Jr NTR) తాము ఆస్కార్‌కి హాజరవుతామని, అయితే స్టేజ్‌పై పాటను ప్రత్యక్షంగా డాన్స్ చేయడం వీలు కాలేదని తెలిపారు. దీంతో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు పాటను పాడి ఆకట్టుకున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ నెలరోజుల పాటు శ్రహించారు. కఠిన సాధన చేశారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి స్టార్స్ తీవ్ర కాళ్ల నొప్పితో బాధపడ్డారు. ఎన్టీఆర్. 15 రోజుల వ్యవధిలో నాటు నాటు పాటను చిత్రీకరించారు.
Also Read: Jr NTR: ఆస్కార్ తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఎగబడ్డ ఫ్యాన్స్