HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Why Mehar Ramesh Jr Ntr Sakthi Movie Failure

NTR : ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ లాంటి సినిమా చేయాలని మొదలుపెడితే.. చివరికి ‘శక్తి’ అయ్యింది.. అసలు కథ ఏంటో తెలుసా..?

శక్తి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. హాలీవుడ్ రేంజ్ లో ఒక మూవీ రాబోతుందని అని అనుకున్నారు. కానీ థియేటర్ లో మొత్తం సీన్ రివర్స్ అయ్యింది.

  • Author : News Desk Date : 03-08-2023 - 10:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Why Mehar Ramesh Jr NTR Sakthi Movie Failure
Why Mehar Ramesh Jr NTR Sakthi Movie Failure

జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), దర్శకుడు మెహర్ రమేష్(Mehar Ramesh) కలయికలో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ శక్తి (Sakti). సి అశ్వినీదత్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. 2011లో భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు ఒక పీడ కల లాంటిది. ఈ మూవీ కంటే ముందు మెహర్ రమేష్, ఎన్టీఆర్ తో ‘కంత్రి’ వంటి మాస్ యాక్షన్ ఫిలిం తెరకెక్కించాడు. ఆ మూవీ పర్వాలేదనిపించింది. ఆ తరువాత ప్రభాస్ తో తెరకెక్కించిన ‘బిల్లా'(Billa)ని కూడా స్టైలిష్ యాక్షన్ గా తెరకెక్కించి సూపర్ అనిపించాడు మెహర్.

దీంతో శక్తి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. హాలీవుడ్ రేంజ్ లో ఒక మూవీ రాబోతుందని అని అనుకున్నారు. కానీ థియేటర్ లో మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. నిజానికి మెహర్ కూడా హాలీవుడ్ మూవీ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ లాంటి సినిమా చేయాలనే మొదలు పెట్టాడు. అసలు ముందు రాసుకున్న కథ వేరు. కంత్రి తరువాత మెహర్ రమేష్ నిర్మాత అశ్వినీ దత్ దగ్గరకి వచ్చి ఒక స్పై యాక్షన్ మూవీ చెప్పాడట. ఆ కథ నచ్చడంతో నిర్మాత కూడా ఓకే చెప్పేశాడు. ఎన్టీఆర్ నుంచి కూడా మూవీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. బెటర్ ఒపీనియన్ కోసం మెహర్ తన స్నేహితులైన అల్లు అర్జున్ అండ్ వివి వినాయక్ కూడా కథ వినిపించి సలహాలు తీసుకున్నాడట.

Bhola Shankar: భోళాజీ.. ప్రమోషన్స్ ను షురూ చేయండిజీ

ఇక్కడ వరకు అంతా ఓకే. అయితే ఈ మూవీ కంటే ముందు ఎన్టీఆర్ ‘బృందావనం’ కోసం డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమాకి కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో అశ్వినీ దత్ కి ఒక ఆలోచన వచ్చింది. ఎన్టీఆర్ తో ‘జగదేక వీరుడు’, ‘పాతాళ భైరవి’ లాంటి సోషియో ఫాంటసీ మూవీ తీస్తే బాగుంటుందని భావించి.. ఇండస్ట్రీలో ఉన్న సీనియర్‌ రచయితలను పిలిపించారు. చివరిగా మెహర్ రమేష్ కథలో మార్పులు చేసి శక్తి కథని రాశారు. నిజానికి సినిమా విషయంలో ఇదే పెద్ద తప్పు అయ్యింది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా స్పై యాక్షన్ మూవీలా ఉంటే, సెకండ్ హాఫ్ నుంచి సోషియో ఫాంటసీగా కనిపిస్తుంది. ఇలా ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి సంబంధం లేకుండా సినిమా ఉండడమే డిజాస్టర్ కి కారణమైందని అంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jr ntr
  • Mehar Ramesh
  • ntr
  • Sakthi
  • Sakthi Movie

Related News

Appointment of New Committee for the AP Film Development Corporation

APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థకు (APSFTVTDC) రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలకమండలిని నియమించింది. సంస్థ ఛైర్మన్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ పంపిణీదారుడు పి. భరత్ భూషణ్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వైస్ ఛైర్మన్‌గా ప్రముఖ సినీ దర్శకుడు చిక్కాల మెహర్ రమేష్ కుమార్ (మెహర్ రమేష్) నియమితులయ్యారు

  • Is this the secret behind the name 'Luger' for Jr. NTR?

    Jr NTR లూగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..!

  • Fans Chant:

    Jr NTR సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు

Latest News

  • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

  • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

  • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

  • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

Trending News

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd