Happy Birthday Rajini Sir: తలైవా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ మేకప్ సీక్రెట్ ఏంటి ?
రజినీకాంత్.. ఈ పదం వింటే చాలు ఆయన ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. ఆయన నడిచినా.. మాట్లాడినా.. సన్ గ్లాసెస్ తిప్పుతున్నా.. అందులో ఉన్న రజనీకి మాత్రమే సొంతమయ్యే స్టైల్ తో 40 ఏళ్ల నుంచి మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు.
- By Hashtag U Published Date - 11:50 AM, Sun - 12 December 21

రజినీకాంత్.. ఈ పదం వింటే చాలు ఆయన ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. ఆయన నడిచినా.. మాట్లాడినా.. సన్ గ్లాసెస్ తిప్పుతున్నా.. అందులో ఉన్న రజనీకి మాత్రమే సొంతమయ్యే స్టైల్ తో 40 ఏళ్ల నుంచి మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. 70 ఏళ్ల ఈ సూపర్‌స్టార్ ఎప్పుడూ అంత యవ్వనంగా కనిపించడం ఆయనకు మాత్రమే సొంతమంటే ఎవరూ కాదనలేరు. డిసెంబర్ 12న రజనీకాంత్ 71వ ఏట అడుగుపెడుతున్నాడు. తెరపై నటుడికి 40 ఏళ్లు దాటినా ఆయన ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. బయటకు వచ్చినపుడు తన ఏజ్ ను దాచే ఏ ప్రయత్నం చేయని రజనీ.. వెండితెరమీద సూపర్ హీరోలా మెరిసిపోతాడు. 90లో చేసినంత ఈజీగా ఇప్పుడు యంగ హీరోలకు ధీటుగా ఆకట్టుకుంటున్నాడు. ఇలా ఉండటం అంత తేలిక కాదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. బయట ఎలా మేనేజ్ చేసినా మనస్సు యవ్వనంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని అంటున్నారు. దీనినే రజనీ ఇన్నాళ్లు మెయింటెయిన్ చేస్తున్నాడని చెబుతున్నారు. ఎంత కాదునుకున్నా 70 ఏళ్ల వయసులో, 40 ఏళ్ల వయసులో బాడీ ఒకేలా ఉండదన్న నిజం అందరికీ తెలిసిందే. అందుకే ఈ విషయంపై తలైవా ఎప్పుడూ కేర్ తీసుకుంటూనే ఉంటాడు. అయితే దీనికోసం కెమెరా ఫ్రేమ్ వర్క్ చాలానే ఉంటుందట.
Also Read : సుక్కు బ్రిలియన్స్ పై బన్నీకి అంత నమ్మకం ఉందా?
కాలా, కబాలిలో రజనీకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన అను వర్ధన్ అంత పెద్ద స్టార్ తో కలిసి వర్క్ చేయడం చాలా విషయాలు నేర్చుకోవడమే అని చెబుతోంది. వెస్ట్రన్ లుక్, సూట్లతో కబాలీలో కనిపిస్తే .. దోతీలతో కాలాలో సరికొత్తగా కనిపిస్తారని అలా అతనితో కలసి పనిచేయడం చాలా హ్యాపీనెస్ నిచ్చిందని ఆమె అంటోంది. ఈసమయంలో రజనీ మేకప్ విషయంలో పెద్దగా పట్టించుకునేవారు కాదని చెబుతోంది. ఇప్పుడయితే ఇలా ఉన్నారు కానీ ఒకప్పుడు రజీనీ తన జుట్టును ఎవర్నీ తాకనిచ్చేవారు కాదట. మేకప్ ఆర్టిస్ట్ లకు కూడా అలాగే చేసేవారట. కేవలం చేతివేళ్లతోనే జుట్టును సరిచేసుకుని షాట్ కు రెడీ అయ్యేవాడట. అయితే 1976లో ఒక్కసారి మాత్రమే దువ్వెన పెట్టే ఛాన్స్ ఇచ్చారట. అలాగే 1977లో అవర్గల్ అనే మూవీ కోసం హెయిర్ జెల్ వాడేడట తలైవా. తర్వాత విగ్ లు వాడటం మొదలు పెట్టాడు.
Also Read : “లైగర్” నుంచి మైక్ టైసన్ లుక్ రిలీజ్
ఆశ్చర్యంగా రజనీకాంత్‌కు 50 ఏళ్లు వచ్చే వరకు ఒక్క ముడత కూడా లేదట. ఆ తర్వాత అతని ముడతలను మేకప్ తో, విజువల్ ఎఫెక్ట్స్ , కరెక్షన్ , డిజిటల్ సాయంతో తొలగిస్తున్నారు. 2007లో వచ్చిన శివాజీ మూవీ కోసం తెల్లగా కనిపించాలి. దీనికోసం 630 షాట్‌ల కోసం 9,000 కంటే ఎక్కువ స్కాన్ చేసిన ఫ్రేమ్‌లలో యూరోపియన్ డ్యాన్సర్ చర్మాన్ని డిజిటల్‌గా రజనీకాంత్‌పై స్కిన్ పై కనిపించేటట్లు చేశారట. కానీ దీని కోసం ప్రత్యేకంగా మేకప్ వేయలేదు. రజనీకాంత్ ఎంథిరన్ లుక్ కోసం ఫేస్, బాడీని 3D స్కానింగ్ తో కవర్ చేశారు. అలాగే 102 సినిమాలో అమితాబ్ కోసం ఇదే వాడారు. ఈ ప్రొస్తెటిక్‌లో చాలా భాగాలున్నాయి. ఇందులో మొదట ఈ హీరో ఫేస్ ను, బాడీ షేప్ ను 3D కొలతలో తీసుకుంటారు. ఆ తర్వాత శిల్పం , మౌల్డ్ ను తయారు చేసి.. దానిలో సిలికాన్ ముక్కలను కలుపుతారు. ముందుగా సిలికాన్ ముక్కలను యాక్టర్ పై అప్లై చేసి, అపుడు వాళ్లకు రావాల్సిన ఫీచర్స్ ను తీసుకువస్తారు. శివాజీ, బాస్ మూవీలు చేసినపుడు కూడా విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే వాడారు. కానీ ఎలాంటి టూల్స్ వాడలేదు. అయితే రజనీకాంత్ ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ ఎలా ఉంటారో అందరికీ తెలుసు. అలా ఉండటం ఒక్క తలైవాకు మాత్రమే చెల్లుతుందని ఆయన అభిమానులు గర్వంగా చెబుతుంటారు.
Also Read :Viral Pics : ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు.. భర్తతో శ్రియ లిప్ లాక్!