HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >What Is Vijay Deverakonda Remuneration For Liger

Vijay Deverakonda Remuneration:‘లైగర్’ కోసం విజయ్ పారితోషికం ఎంతంటే!

‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

  • Author : Hashtag U Date : 24-08-2022 - 1:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Liger
Liger

‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. గురువారం విడుదలయ్యే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ప్రమోషన్లలో దేశంలో ఎక్కడికి వెళ్లినా అభిమానులు విజయ్ కి బ్రహ్మరథం పట్టారు. అన్ని రాష్ట్రాల్లో విజయ్కి అభిమానులు పెరిగిపోయారు. బాలీవుడ్ స్టార్లకు తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు విజయ్ సొంతమైంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’తో హీరోగా మారేముందు విజయ్ పలు చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ‘గీత గోవిందం’, ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని సంపాదించు కున్నాడు. ‘లైగర్’ ముందు వరకు విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు రూ. 6 నుంచి 7 కోట్లు పారితోషికంగా తీసుకునేవాడు.

అయితే ‘లైగర్’ కోసం విజయ్ ఏకంగా 20-25 కోట్లు తీసుకున్నాడట. ‘లైగర్’ బడ్జెట్ దాదాపు రూ. 90 కోట్లు కాగా ఇందులో మెజారిటీ వంతు విజయ్పారితోషికం అని తెలుస్తోంది. ‘లైగర్’ బ్లాక్ బస్టర్ అయితే విజయ్ దేవరకొండ తన పారితోషికాన్ని మరింత పెంచుకోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ చిత్రం ‘ఆర్ఆర్ ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్2’ స్థాయిలో హిట్ అయితే చిత్ర నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ తో కలిసి విజయ్ లాభాల్లో వాటా కూడా పంచుకునే అవకాశం ఉంది.

విజయ్, హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాను 40 రోజుల పాటు ప్రమోట్ చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొని చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేశారు. ఈ నేపథ్యంలో ‘లైగర్’ కంటెండ్ సగటు కంటే ఎక్కువ ఉంటే ఇది పెద్ద హిట్ కాబోతోందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాల అభిప్రాయపడ్డారు. ‘ఈ ఏడాది అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో ‘లైగర్’ ఒకటి. కంటెంట్ బాగుంటే ఇది అతని అద్భుతమైన చిత్రం కావచ్చు. కమర్షియల్‌గా ‘లైగర్’ బాగా రాణిస్తే, విజయ్ కి ఇక తిరుగుండదు. బాలీవుడ్ లో పెద్ద స్టార్ అయిపోతాడు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. శివ నిర్మాణ దర్శకత్వంలో ‘ఖుషీ’ చిత్రంలో నటిస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే పూరితో ‘జన గణ మన’ సెట్స్ పైకి వెళ్లనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • deverakonda remuneration
  • liger
  • tollywood
  • vijay deverakonda

Related News

Allu Arjun appeal to Delhi high court for his privacy

Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

Delhi High Court సినిమా రంగంలో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం న్యాయక్షేత్రంలో అడుగుపెట్టారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, చివరకు తన వాయిస్‌ను కూడా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకుండా చూడాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పు పొంచి ఉన్న ఈ కాలంలో

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

  • Nivetha Pethuraj

    Nivetha Pethuraj: బ్రేకప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నివేదా పేతురాజ్!

  • Producer Supriya Yarlagadda Speech at Dacoit Movie Success Meet

    Dacoit: ‘డెకాయిట్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది – సుప్రియ యార్లగడ్డ

Latest News

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

  • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd