HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >We Will Not Heed Pawan Kalyans Warning C Kalyan

Theatre Bandh Issue : పవన్ కళ్యాణ్ హెచ్చరికను పట్టించుకోము – సి కళ్యాణ్

Theatre Bandh Issue : థియేటర్లు మూసివేతపై ప్రభుత్వం స్పందించిన తరుణంలో ఇండస్ట్రీ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు

  • Author : Sudheer Date : 31-05-2025 - 12:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
C Kalyan
C Kalyan

తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood)లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శుక్రవారం విశాఖపట్నం(Vizag)లో ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా సినిమా హాళ్ల నిర్వహణ, టికెట్ ధరలు, పర్సంటేజీలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో సినీ నిర్మాతలు సి. కళ్యాణ్, స్రవంతి రవికిశోర్, సుధాకర్ రెడ్డి, భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యలపై స్థిరమైన నిర్ణయాలు తీసుకునేందుకు సంఘాల్లోని సభ్యులతో కూడిన జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Bayya Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ ఎక్కడ?

సి. కళ్యాణ్ (C Kalyan)మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో సంఘం నుంచి తొమ్మిది మంది చొప్పున మొత్తం 27 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఇండస్ట్రీకి ప్రయోజనకరమైన మార్గాలను సూచించనుంది. త్వరలో ఈ కమిటీ వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. సినిమా హాళ్లలో జరిగే తనిఖీలు, నిర్వహణ అంశాలపై కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టనుందని చెప్పారు. ప్రతి నెలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారన్న ఆరోపణలను ఖండిస్తూ “ఆయన మా స్నేహితుడు, గౌరవించిన నాయకుడు, ఆయన చెప్పిన మాటలను మేం స్వాగతిస్తాం కానీ వార్నింగ్‌గా తీసుకోం” అని అన్నారు. థియేటర్లు మూసివేతపై ప్రభుత్వం స్పందించిన తరుణంలో ఇండస్ట్రీ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. థియేటర్ల నిర్వహణ, టికెట్ ధరలు, పన్నులు, తినుబండారాల ధరలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని, వీటన్నింటిని పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • c kalyan
  • Pawan Kalyan
  • Theatre Bandh Issue
  • tollywood

Related News

Supreme Court stays Telangana HC order Movie Ticket Prices

సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

Movie Ticket Prices  సినిమా టిక్కెట్ ధరలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతానికి టిక్కెట్ ధరల పెంపుపై ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. టిక్కెట్ రేట్లు పెంచాలంట

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

    తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

  • Nagarjuna's 100th Film

    నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

  • Hansika Divorce

    Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd