Rajinikanth: జయలలిత లాంటి మహిళను మళ్లీ మనం చూడలేం: రజనీకాంత్
(Rajinikanth) తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి నివాళులు అర్పించారు.
- By Balu J Published Date - 06:18 PM, Sat - 25 February 23

నటుడు రజనీకాంత్ (Rajinikanth) తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత 75వ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. జయలలితలోని ప్రత్యేకమైన క్వాలిటీస్ ను ఆయన గుర్తు చేశారు. ఆమెతో తన వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకున్నారు. జయలలిత అసాధారణమైన మహిళ అని, ఆమెలాంటి గ్రేట్ పర్సనాలిటీ మరొకరు ఉండరని ఆయన (Rajinikanth) అన్నారు. ఇతరుల పట్ల జయలలిత చూపించే ప్రేమ, దయను కూడా రజనీకాంత్ ప్రశంసించాడు.
‘‘జయలలిత లాంటి మరో మహిళను మనం చూడలేం.. ఆమె కరుణామయురాలు అని తన ప్రేమను చాటుకున్నాడు రజనీకాంత్ (Rajinikanth). గతంలో జయలలితతో తనకు అపార్థం ఏర్పడిందని, అందుకే ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడానని రజనీకాంత్ వెల్లడించారు. అయితే, తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ జయలలిత తన కుమార్తె వివాహానికి హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. జయలలిత (Jayalalithaa) కూడా రజనీ పట్ల గౌరవం చూపారు. వ్యక్తిగతంగా సమస్యలు ఎదురైనప్పటికీ ఆమె రజనీకాంత్ పట్ల గౌరవభావంతో మెలిగారు.
Also Read: Congress plenary : సోనియా ఆఖరి ఇన్నింగ్స్ `భారత్ జోడో`