Nithin : నితిన్ వల్ల రూ.2 కోట్లు నష్టపోయాం – నిర్మాత ఆవేదన
Nithin : నితిన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో తాము ఎంతో నష్టపోయామని వాపోయాడు
- By Sudheer Published Date - 05:01 PM, Mon - 14 April 25

హీరో నితిన్(Nithin)పై ప్రముఖ డైరెక్టర్ వశిష్ఠ తండ్రి (Director Vassishta) సత్యనారాయణరెడ్డి (Mallidi Satyanarayana Reddy) గారు తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడు వశిష్ఠ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని నితిన్ ముందుగా అంగీకరించి రూ.75 లక్షల అడ్వాన్స్ తీసుకున్నాడని, అనంతరం ఆ సినిమానుండి తప్పుకున్నాడని తెలిపారు. “ఆ సమయంలో ‘అ ఆ’ సినిమా పెద్ద హిట్ అయింది. దాంతో వశిష్ఠతో సినిమా చేస్తే తన రేంజ్ తగ్గిపోతుందనే భావించి నితిన్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడు” అని వివరించారు.
Ambedkar Vidya Nidhi Scheme : అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం – చంద్రబాబు
నితిన్ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులకు, స్క్రిప్ట్ వర్క్, టీమ్ ఏర్పాట్లకు సుమారు రూ.2 కోట్లు ఖర్చు అయినట్లు సత్యనారాయణ తెలిపారు. నితిన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో తాము ఎంతో నష్టపోయామని వాపోయాడు. తర్వాత వశిష్ఠ “బింబిసార” సినిమా విజయం అందుకున్నాడని తెలిపాడు. ప్రస్తుతం వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో భారీ ఫాంటసీ సినిమా చేస్తున్నాడు. ఈ టైంలో పాత వివాదం తెరపైకి తీసుకొచ్చి సత్యనారాయణ వార్తల్లో నిలిచాడు. మరి దీనిపై నితిన్ ఏమైనా స్పందిస్తాడా అనేది చూడాలి. రీసెంట్ గా నితిన్ రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశకంర్‌లు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.