Bad News for Bad Guys : RGV ‘వ్యూహం’ నికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెన్సార్..
- By Sudheer Published Date - 11:00 PM, Wed - 13 December 23

రామ్ గోపాల్ వర్మ (RGV) మొత్తానికి తన పంతం నెగ్గించుకున్నాడు. ‘వ్యూహం’ (vyuham ) చిత్రానికి సెన్సార్ (Censor) నుండి గ్రీన్ సిగ్నల్ తీచ్చుకొని రిలీజ్ కు సిద్ధం అయ్యాడు. గత కొద్దీ కాలంగా వర్మ..జగన్ కు సపోర్ట్ గా సినిమాలు తెరకెక్కించడమే కాదు సోషల్ మీడియా లో ట్వీట్స్ చేస్తూ..ప్రతిపక్ష పార్టీల ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జగన్ కు సపోర్ట్ గా వ్యూహం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే ఈ మూవీలో చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), చిరంజీవితో (Chiranjeevi)పాటు పలువురు ప్రముఖులకు పాత్రలు ఉండటంతో.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈసినిమాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ మూవీ ట్రైలర్ సైతం సినిమా ఫై ఆసక్తి నింపింది.
నవంబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ చూసారు..సరిగ్గా వారం రోజుల్లో ఈ మూవీ రిలీజ్ అనగా.. సెన్సార్ బోర్డ్ ఈమూవీకి అడ్డు కట్ట వేసింది. ఈ మూవీలోని పాత్రలు నిజ జీవితంలోని వ్యక్తులను పోలి ఉన్నాయని, పేర్లు కూడా ఆ వ్యక్తులకు సంబంధించినవే పెట్టారని తెలుపుతూ..సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.
దాంతో నవంబర్ 10న రిలీజ్ కావల్సిన వ్యూహం వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఇప్పుడు సెన్సార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో..వర్మ సోషల్ మీడియా వేదికగా ఈమూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. డిసెంబర్ 29న ఈమూవీ రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించాడు. అంతే కాదు సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకుని దిగిన ఫోటో ను షేర్ చేసారు.
BAD NEWS for BAD GUYS 💪
VYUHAM censor CERTIFICATE 🙌
DECEMBER 29 th in THEATRES 😌 pic.twitter.com/LBBKAt977s
— Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2023
Read Also : Akunuri Murali On Smita Sabharwal : స్మితా సబర్వాల్ ఫై ఆకునూరి మురళీ సంచలన వ్యాఖ్యలు..