Nivetha and Vishwak Sen: వాట్ ఏ కెమిస్ట్రీ.. నివేదాతో విశ్వక్ సేన్ రొమాన్స్ మాములుగా లేదు!
విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ కు సంబంధించిన ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
- By Balu J Published Date - 02:56 PM, Fri - 23 December 22
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) సంచలనాలకు మారు పేరు. సినిమాల్లోనే కాకుండా పర్సనల్ లైఫ్ లోనూ ఈ హీరో తరుచుగా హాట్ టాపిక్ గా మారుతుంటాడు. ‘ఓరి దేవుడా’ లాంటి డీసెంట్ సినిమా తర్వాత ‘దస్ కా ధామ్‌కి’ (Das Ka Dhamki) అనే పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. ఇక ఇందులోని మొదటి పాట ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల’ యూట్యూబ్‌లో హిట్ సాంగ్ గా నిలిచింది. ఫిబ్రవరిలో సినిమా విడుదలవుతున్నప్పటికీ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ పుల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్.
లైవ్లీ బీట్లతో పెప్పీ స్టప్పులతో, అదిరిపొయే బీచ్ లు ఈ పాటకు ఆకర్షణగా నిలిచాయి. పాటలోని విజువల్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. విశ్వక్ సేన్ (Vishwak Sen) స్మూత్ డ్యాన్స్ మూవ్స్‌తో యూత్ ఆకట్టుకున్నాడు. అయితే బీచ్ సాంగ్‌లో నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) గ్లామర్‌తో తనవైపు తిప్పుకుంటోంది. ఈ వీడియో సాంగ్ ను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సినీ ప్రేమికులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ చిత్రం 17 ఫిబ్రవరి 2023న విడుదల కానుంది. విశ్వక్ సేన్ (Vishwak Sen) స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరాటే రాజు నిర్మించారు. ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమ కోసమే’, రాబోయే ‘ధమాకా’ వంటి హిట్ చిత్రాలకు కథలను అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ మూవీకి కథ, సంభాషణలు అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: Dhamaka Review: రవితేజ ‘ధమాకా’ ఎలా ఉందంటే!
Related News
Gangs of Godavari Teaser : విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్ చూశారా..?
విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్ చూశారా..? పూర్తి యాక్షన్ కట్ తో టీజర్..