Gangs of Godavari : అప్పుడే ఓటీటీకి వచ్చేస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. ఎప్పుడంటే..?
అప్పుడే ఓటీటీకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఎప్పుడు..? ఎక్కడ..?
- By News Desk Published Date - 10:14 AM, Sun - 9 June 24

Gangs of Godavari : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహశెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించారు. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేసారు. పీరియాడిక్ పొలిటికల్ రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.
బాక్స్ ఆఫీస్ వద్ద విశ్వక్ సేన్ యాక్టింగ్ మంచి మార్కులే పడ్డాయి. అయితే సినిమాకి మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం, ఎన్నికల రిజల్ట్స్ సమయం కావడంతో.. మూవీకి కొంచెం మైనస్ అయ్యింది అనే చెప్పాలి. ఇక తాజాగా శర్వానంద్ ‘మనమే’ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఇబ్బందిగా మారినట్లు తెలుస్తుంది.
దీంతో ఈ సినిమాని రెండు వారాల్లోనే ఓటీటీకి తీసుకు వచ్చేస్తున్నారు. జూన్ 14 నుంచి ఈ మూవీని ఓటీటీలో ప్రసారం చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమ్ చేయనున్నారు. మరి ఈ మాస్ రూరల్ మూవీని థియేటర్స్ లో మిస్ అయ్యినవారుంటే.. ఓటీటీలో చూసే ఎంజాయ్ చేసేయండి.
#GangsofGodavari Digital Streaming from JUNE14 on Netflix
Within 15 Days theatrical Release 🥲 pic.twitter.com/vFv485aRoI
— Filmy Bowl (@FilmyBowl) June 9, 2024