Vishwak Sen : విశ్వక్ సేన్‌కి షూటింగ్ లో ప్రమాదం జరిగిందా? లారీ మీద నుంచి కింద పడి..
విశ్వక్ సేన్(Vishwak Sen) ప్రస్తుతం మంచి ఫామ్ లోనే ఉన్నాడు. త్వరలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari) సినిమాతో రాబోతున్నాడు.
- Author : News Desk
Date : 16-11-2023 - 6:34 IST
Published By : Hashtagu Telugu Desk
నటుడు విశ్వక్ సేన్(Vishwak Sen) ప్రస్తుతం మంచి ఫామ్ లోనే ఉన్నాడు. దాస్ కా ధమ్కీ సినిమాతో ఈ సంవత్సరం వచ్చి మంచి విజయమే అందుకున్నాడు. ఆహాలో యాంకర్ గా ఓ షో కూడా చేస్తున్నాడు. త్వరలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari) సినిమాతో రాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి(Neha Shetty) జంటగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా డిసెంబర్ 8న రాబోతుందని ప్రకటించారు.
గోదావరి జిల్లాల్లోని ఓ ఊరిలో జరిగే రాజకీయాల నేపథ్యంలో ఫుల్ పీరియాడిక్ మాస్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజయిన సాంగ్, టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ అయిపోయిందని సమాచారం. కానీ తాజాగా ఈ సినిమా షూట్ లో విశ్వక్ సేన్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
షూటింగ్ సమయంలో ఓ ఫైట్ సీన్ షూట్ చేస్తుండగా విశ్వక్ సేన్ లారీ మీద నుంచి కింద పడినట్టు ఈ వీడియోలో ఉంది. దీంతో షూటింగ్ సమయంలో విశ్వక్ సేన్ కి ఏమైనా ప్రమాదం జరిగిందా ? గాయాలు అయ్యాయా అని అభిమానులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ అయిపోయింది కాబట్టి ఈ వీడియో పాతదే అని తెలుస్తుంది. మరి దీనిపై విశ్వక్ సేన్ స్పందిస్తాడేమో చూడాలి. సినిమా ప్రమోషన్స్ లో అయినా తనకు జరిగిన ప్రమాదం గురించి చెప్తాడేమో చూడాలి.
Shooting for @VishwakSen A near miss#viswaksen #vishwaksen #viralshorts #tollywoodnewshttps://t.co/dv2oNN4E5Y
— Amma Prasanth (@BobbiliBobbili) November 15, 2023
Also Read : Virat Kohli : అత్యధిక శతకాలతో రికార్డ్ సృష్టించిన కోహ్లీ.. టాలీవుడ్ స్టార్స్ అభినందనలు..