Gangs of Godavari : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి సీక్వెల్ ఉంది.. ఆ స్టోరీ థీమ్ చెప్పిన విశ్వక్ సేన్..
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'కి సీక్వెల్ ఉంది. మూవీ చివరిలో సీక్వెల్ కి సంబంధించిన హింట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే..
- By News Desk Published Date - 07:37 PM, Fri - 31 May 24

Gangs of Godavari : టాలీవుడ్ లో సీక్వెల్స్ జోరు నడుస్తుంది. అసలు సినిమా రిలీజ్ కాకముందే, దాని రిజల్ట్ తెలియకముందే సీక్వెల్స్ ని ప్రకటించేస్తున్నారు. అలా సినిమా రిలీజ్ కంటే ముందే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సీక్వెల్ పై కూడా నిర్మాత నాగవంశీ కామెంట్స్ చేసారు. “సినిమా టైటిల్ లో సరిగ్గా గమనిస్తే, టైటిల్ చివరిలో ఐ (i) అనే అక్షరాన్ని ఒకటిగా రాశాము. అంటే సీక్వెల్ ఉన్నట్లేగా” అంటూ చెప్పుకొచ్చారు.
ఈ కామెంట్స్ తో రిలీజ్ కి ముందే సీక్వెల్ ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యింది. అయితే మూవీ ఎండింగ్ లో సీక్వెల్ గురించి ఎటువంటి హింట్ ఇవ్వలేదు. దీంతో అసలు సీక్వెల్ ఉంటుందా లేదా అనే సందేహం కలిగింది. ఈ సందేహం గురించి మూవీ టీంని ప్రశ్నించగా.. విశ్వక్ సేన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆడియన్స్ నుంచి మూవీకి మంచి స్పందన రావడంతో.. చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ మీటింగ్ లోనే సీక్వెల్ గురించి ప్రశ్నించగా, విశ్వక్ బదులిస్తూ.. “సీక్వెల్ వంద శాతం ఉంది. నిజానికి మూవీ ఎండింగ్ లో సీక్వెల్ కి సంబంధించిన టైటిల్ వేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలు వల్ల వెయ్యలేదు. ఎందుకంటే, ఈ సినిమా కథ ఒక ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఇప్పటి సినిమాలో గోదావరి ప్రాంతానికి చెందిన గ్యాంగ్స్ ని చూపించినట్లు, సీక్వెల్ లో మరో ప్రాంతానికి చెందిన గ్యాంగ్స్ ని చూపించబోతున్నాము” అంటూ చెప్పుకొచ్చారు.
#GangsofGodavari కు Sequel 100% ఉంటుంది… పార్ట్ 2 కి థియేటర్ లో లీడ్ కార్డు వేయకపోవడానికి రీజన్.. pic.twitter.com/MXhmv4NNAH
— M9 NEWS (@M9News_) May 31, 2024
మరి ఆ ప్రాంతం.. అటవీ ప్రాంతం అవుతుందా, బొగ్గు గనుల ప్రాంతం అవుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఈ సినిమాతో అయితే ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విశ్వక్ సేన్ అదరగొట్టేశారని చెబుతున్నారు.