Leo Collections : లియో సినిమా కలెక్షన్స్ ఫేక్? థియేటర్స్ ఓనర్స్ ఆగ్రహం.. స్పందించిన డైరెక్టర్..
లియో సినిమా మొదటి రోజే 140 కోట్ల కలెక్షన్స్ వచ్చిందని, వారం రోజుల్లోనే 461 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే దీనిపై తమిళనాడు థియేటర్స్ యూనియన్, థియేటర్స్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Author : News Desk
Date : 30-10-2023 - 5:48 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్(Vijay) హీరోగా ఇటీవల దసరాకు లియో(Leo) సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా విజయ్ అభిమానులని మెప్పించినా, మాములు ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. లోకేష్ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు. దీంతో తమిళనాడు బయట నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగానే వస్తున్నాయి.
లియో సినిమా మొదటి రోజే 140 కోట్ల కలెక్షన్స్ వచ్చిందని, వారం రోజుల్లోనే 461 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే దీనిపై తమిళనాడు థియేటర్స్ యూనియన్, థియేటర్స్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత తప్పుడు కలెక్షన్స్ చూపిస్తున్నారని, మాకు లియో సినిమాతో లాభాలు రాలేదని వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా దీనిపై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్పందించారు. ఓ ప్రెస్ మీట్ కి వెళ్లిన లోకేష్ ని మీడియా వాళ్ళు లియో ఫేక్ కలెక్షన్స్ గురించి ప్రశ్నించగా.. సినిమా కలెక్షన్స్ గురించి నాకు తెలీదు. అది నిర్మాతను అడగండి అని అన్నారు. అయితే సినిమా సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం సాగదీసినట్టు ఉందని ఆడియన్స్ అంటున్నారు, దానికి మాత్రం ఒప్పుకుంటాను అని తెలిపారు లోకేష్ కనగరాజ్.
Also Read : Renu Desai : వరుణ్ తేజ్ పెళ్ళికి వెళ్లట్లేదు.. నేను వెళ్తే అక్కడ అందరూ.. రేణు దేశాయ్ వ్యాఖ్యలు..