Vijay – M M Srilekha : తమిళ్ హీరో విజయ్ మొదటి సినిమాకి 12 ఏళ్లకే సంగీత దర్శకత్వం వహించిన కీరవాణి సోదరి..
విజయ్, శ్రీలేఖ ఇద్దరి కెరీర్ ఒకే సినిమాతో మొదలైంది. విజయ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రానికి సంగీతం అందిస్తూ శ్రీలేఖ కూడా పరిచయమైంది.
- By News Desk Published Date - 09:00 PM, Wed - 23 August 23

తమిళ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఏ చంద్రశేఖర్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో విజయ్(Vijay). తన సినిమాలతో తమిళనాడులోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక MM శ్రీలేఖ(Srilekha) విషయానికి వస్తే.. కీరవాణి (M M Keeravani) అండ్ రాజమౌళి (Rajamouli) సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సంగీత దర్శకురాలిగా, సింగర్ గా ప్రయాణం మొదలు పెట్టింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏకైక లేడీ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
విజయ్, శ్రీలేఖ ఇద్దరి కెరీర్ ఒకే సినిమాతో మొదలైంది. విజయ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రానికి సంగీతం అందిస్తూ శ్రీలేఖ కూడా పరిచయమైంది. 1992లో యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ‘నాలైయా తీర్పు’ (naalaiya theerpu) చిత్రంతో విజయ్ అండ్ శ్రీలేఖ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. విజయ్ తండ్రి ఇండస్ట్రీలో అప్పటికే స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. దీంతో తన దర్శకత్వంలోనే విజయ్ ని హీరోగా అభిమానులకు పరిచయం చేశారు. ఆ సమయంలో తమిళ్ ఇండస్ట్రీలోని చాలామంది దృష్టి ఈ సినిమాపై ఉంది.
ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి.. ఏ అనుభవం లేని శ్రీలేఖ సంగీత దర్శకురాలిగా ఎంపిక అవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ సమయంలో ఆమె వయసు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఆ సినిమాకి సంగీతం అందించినప్పుడు శ్రీలేఖ వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. 12 ఏళ్ళ వయసులోనే ఒక సినిమాకి సంగీత దర్శకురాలిగా పని చేసి సంచలనం సృష్టించింది శ్రీలేఖ. ఆ తరువాత తెలుగులో అనేక సినిమాలకు సంగీతం అందిస్తూ వచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన అడివిశేష్ హిట్ 2 (Hit 2) చిత్రానికి కూడా శ్రీలేఖనే సంగీతం అందించింది.
Akira Nandan : పవన్ తనయుడు అకిరా హీరో అవ్వడంట.. కానీ సినీ పరిశ్రమే.. మరి ఏమవుతాడు?