Akira Nandan : పవన్ తనయుడు అకిరా హీరో అవ్వడంట.. కానీ సినీ పరిశ్రమే.. మరి ఏమవుతాడు?
రేణు దేశాయ్ అకిరా హీరో అవ్వడు అని డైరెక్ట్ గానే తన సోషల్ మీడియా స్టోరీలో పోస్ట్ చేసేసింది. తన గురించి ఎక్కువ ప్రమోట్ చేయకండి, మీరు అనుకున్నది కాదు అని పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.
- Author : News Desk
Date : 23-08-2023 - 8:31 IST
Published By : Hashtagu Telugu Desk
పవన్(Pawan Kalyan) తనయుడు అకిరా నందన్(Akira Nandan) సినిమాల్లోకి రావాలని, హీరో అవ్వాలని పవర్ స్టార్(Power Star) అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇటీవల రాఘవేంద్రరావుతో(Raghavendra Rao) అకిరా నందన్(Akira Nandan) ఫోటో బయటకి రావడంతో, అకిరా అమెరికా(America)లోని ఫిలిం స్కూల్(Film School) లో జాయిన్ అవుతున్నాడు అని తెలియడంతో హీరో మెటీరియల్ అంటూ కామెంట్స్ చేశారు, త్వరగా సినిమా తీయాలని కోరుకున్నారు. రాత్రికి రాత్రి అకిరా ఫోటో బాగా వైరల్ అయింది.
అయితే రేణు దేశాయ్ అకిరా హీరో అవ్వడు అని డైరెక్ట్ గానే తన సోషల్ మీడియా స్టోరీలో పోస్ట్ చేసేసింది. తన గురించి ఎక్కువ ప్రమోట్ చేయకండి, మీరు అనుకున్నది కాదు అని పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో మరి ఫిలిం స్కూల్ కి ఎందుకు అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా నేడు రేణుదేశాయ్ మరో పోస్ట్ పెట్టి అకిరా గురించి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల అకిరా, రేణు దేశాయ్ నార్వే వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో పాటు పారిస్ కూడా వెళ్లారు. ఆ ట్రిప్ ని ఒక చిన్న వీడియో తీసి ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఎదిగిన నా బాబు అమెరికాలో ఫిలిం స్కూల్ లో మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు. మీరంతా అనుకున్నట్టు యాక్టింగ్ లో చేరట్లేదు. కాబట్టి ఇకపై అతని గురించి పట్టించుకోవడం ఆపేయండి అని పోస్ట్ చేసింది.
దీంతో అకిరా మ్యూజిక్ నేర్చుకోవడానికి అమెరికా వెళ్లినట్టు అర్ధమవుతుంది. అకిరా మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకుంటున్నట్టు సమాచారం. ఆల్రెడీ గతంలోనే ఓ షార్ట్ ఫిలింకి అకిరా మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. రేణు దేశాయ్ అనేకసార్లు అకిరా పియానో ప్లే చేసిన వీడియోల్ని కూడా షేర్ చేసింది. దీంతో అకిరా కచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని తెలుస్తుంది. అయితే దీనిపై పవన్ అభిమానులు మాత్రం అకిరా హీరో అవ్వడా అని నిరాశ చెందుతున్నారు.