Vijay Deverakonda: మరోసారి ఆ కాంబో రిపీట్ చేసిన విజయ్ దేవరకొండ.. ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న వి
- By Nakshatra Published Date - 08:00 AM, Fri - 9 February 24
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకులను పలకరించడంతోపాటు ఈ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు విజయ్. కాగా విజయ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఈ మూవీ నుండి రిలీజైన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే తాజాగా విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ మరొకసారి కాంబో రిపీట్ చేసారు అంటూ వార్తలు అనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ కాంబో ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ, సిద్ శ్రీరామ్‌తో రిపీట్ అవుతుంది. తాజాగా ఈ కాంబోలో మరో మ్యాజికల్ సాంగ్ వచ్చింది. విజయ్ దేవరకొండ, సిద్ శ్రీరామ్ విషయంలో ప్రతీసారి మ్యాజిక్ జరుగుతోంది. ఈ కాంబోలో పాట వచ్చిందంటే చాలు ఆ పాట బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాటలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేశాయి. ఇకపోతే తాజాగా ఫ్యామిలీ స్టార్ నుంచి విడుదలైన నంద నందనా సాంగ్‌కు అదే రెస్పాన్స్ వస్తుంది. గతంలోనూ విజయ్, సిద్ కాంబినేషన్లో చాలా పాటు వచ్చాయి. ఖుషీలో ఆరాధ్య పాట కూడా చాలా రోజులు ట్రెండింగ్‌లో ఉండిపోయింది. ఇక లైగర్ లో సిద్ శ్రీరామ్ పాడిన కలలో కూడా అంటూ సాగే పాట మంచి హిట్ అయింది. ఇక డియర్ కామ్రేడ్ లోనూ కడలల్లే వేచె మనసే పాట బంపర్ హిట్ అయింది. టాక్సీవాలాలో మాటే వినదుగా సాంగ్ కూడా అంతే. విజయ్ దేవరకొండ, సిద్ శ్రీరామ్ మ్యాజిక్ గీత గోవిందం సినిమా నుంచి మొదలైంది. అందులో ఇంకేం ఇంకేం కావాలి పాట ఇప్పటికీ పాపులరే. ఇలా ప్రతిసారి వీరిద్దరే కాంబినేషన్లో వచ్చిన పాట భారీగా హీట్ అవ్వడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరి ఈసారి ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
Related News
Vijay Devarakonda The Family Star OTT Talk : ది ఫ్యామిలీ స్టార్.. OTT టాక్ ఎలా ఉందంటే..?
సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే థియేటర్ కి వెళ్లి వేలకు వేలకు ఖర్చు పెట్టే రిస్క్ చేయట్లేదు. అందుకే కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ కోసం