Vijay Devarakonda : ఫ్యాన్స్ కు ‘ఖుషి’ రెమ్యూనరేషన్ ఇస్తున్న విజయ్ దేవరకొండ
- Author : Sudheer
Date : 05-09-2023 - 12:58 IST
Published By : Hashtagu Telugu Desk
విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్రసీమలో చాలామంది హీరోలు ఉన్నారు..కోట్లాది కోట్లు సంపాదిస్తున్నారు..కానీ వారిలో చాలామంది మాత్రమే తమ సంపాదనను పేదవారికి , పిల్లలకు , ఆపదలో ఉన్న వారికీ సాయం చేస్తుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు విజయ్ కూడా చేరారు.
అర్జున్ రెడ్డి , గీత గోవిందం వంటి లవర్ , ఫ్యామిలీ స్టోరీస్ తో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ..ఆ రెండు సినిమాలతోనే స్టార్ హీరో గుర్తింపు సాదించుకున్నాడు. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్స్ మాత్రం కొట్టలేకపోయాడు. పూరి తో లైగర్ అంటూ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ..ఆ మూవీ భారీ డిజాస్టర్ అయ్యి..విజయ్ కి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. దీంతో ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనకు కలిసొచ్చిన ప్రేమ కథల వైపు దృష్టి పెట్టాడు. తాజాగా సమంత (Samantha ) తో కలిసి మజిలీ ఫేమ్ శివ నిర్వాణ (Shiva Nirvana) డైరెక్షన్లో ఖుషి (Kushi) మూవీ లో నటించాడు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 1వ తేదీన తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం టాక్ మాత్రమే కాదు కలెక్షన్లు కూడా గట్టిగానే రాబడుతుంది. ఈ క్రమంలో మేకర్స్ వైజాగ్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.
Read Also : Shah Rukh Khan: శ్రీవారి సేవలో జవాన్, కుటుంబ సమేతంగా షారుక్ ఖాన్ పూజలు
ఈ సందర్బంగా ఖుషి సక్సెస్ ను అభిమానులతో పంచుకున్న విజయ్..తనలోని గొప్ప వ్యక్తిని బయటకు తీసాడు. ఖుషిని పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఖుషి సినిమా సంపాదనలోంచి 1 కోటి రూపాయలను 100 కుంటాబాలకు అందజేస్తున్నట్లు తెలిపి సంతోష పరిచాడు. తెలుగు రాష్ట్రాల్లోని 100 కుటుంబాలను ఎంపిక చేసి రానున్న రోజుల్లో ఒక్కొక్కరికి లక్ష చొప్పున విరాళంగా(donation) అందజేస్తానని విజయ్ అన్నారు. విజయ్ ఆన్‌లైన్ ఫారమ్‌ను క్రియేట్ చేస్తానని, దానిని తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేస్తానని తెలిపాడు. అవసరమైన వ్యక్తులు ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తమ బృందం డబ్బు అవసరమైన వారిని ఎంపిక చేసి వారికి అందజేస్తుందన్నారు. దానికి షేరింగ్ ఖుషీ దేవరకొండ ఫ్యామిలీ అని పేరు పెట్టాడు.
Just IN: Vijay Deverakonda to give ₹1 lac each to 100 families in the next 10 days.
Total – ₹ 1 cr
||#Kushi | #VijayDeverakonda|| pic.twitter.com/mpvGfO2t8H
— Manobala Vijayabalan (@ManobalaV) September 4, 2023