Vijay Deverakonda – Rashmika Engagement : గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్ – రష్మిక
Vijay Deverakonda - Rashmika Engagement : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందని సినీ వర్గాల సమాచారం. ఇరు కుటుంబాల సమక్షంలో, చాలా సీక్రెట్‌గా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ గురించి కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిందని చెబుతున్నారు
- Author : Sudheer
Date : 04-10-2025 - 10:01 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్‌లో రౌడీ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్‌గా అభిమానులను కట్టిపడేసిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika) ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎప్పుడూ బహిరంగంగా అంగీకరించలేదు. ఎప్పుడూ మౌనం పాటిస్తూ, తమ వ్యక్తిగత విషయాలపై స్పష్టత ఇవ్వకుండా అభిమానులను ఉత్కంఠలో ఉంచారు. ఇప్పుడు ఈ రూమర్స్‌కి నిజం కబురు అందిస్తూ, సైలెంట్‌గా రింగులు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది.
Blood Pressure: బీపీ,గుండెపోటు సమస్యలు రాకూడదంటే మీ డైట్ లో కచ్చితంగా ఈ ఫుడ్స్ చేర్చుకోవాల్సిందే!
విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందని సినీ వర్గాల సమాచారం. ఇరు కుటుంబాల సమక్షంలో, చాలా సీక్రెట్‌గా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ గురించి కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిందని చెబుతున్నారు. పెళ్లి చేసుకోవడం ముందు నిశ్చితార్థం పెద్ద అడుగుగా భావిస్తారు కాబట్టి, అభిమానులు ఈ వార్తపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఒక సినిమా, రాహుల్ సాంకృత్యాన్‌తో మరో సినిమా ఉన్నాయి. అలాగే మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. రష్మిక మందన్నా కూడా తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలతో బిజీగా ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’తో పాటు హిందీలో ‘కాక్‌టైల్ 2’, అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రంలోనూ నటించనున్నట్లు టాక్. ఈ వ్యస్తతల మధ్య, ఇద్దరూ 2026లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఈ జంట అభిమానులకు మరోసారి సర్‌ప్రైజ్ ఇచ్చినట్టయింది.