Vijay Deverakonda : ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విజయ్ గొప్ప సాయం..
చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విజయ్ గొప్ప సాయం. విజయ్ కి కృతజ్ఞతలు చెప్పడానికి రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్న..
- By News Desk Published Date - 05:32 PM, Fri - 12 July 24

Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ స్క్రీన్ పైనే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా హీరో అనిపించుకుంటున్నారు. సినిమాల్లో మంచి చేస్తే హీరో అంటాము, అదే రియల్ లైఫ్ లో మంచి చేస్తే దేవుడు అంటాము. తాజాగా ఒక వ్యక్తి విజయ్ ని దేవుడు అంటూ ఎమోషనల్ అవుతూ.. విజయ్ చేసిన సాయాన్ని బయటపెట్టారు. ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ 3కి విజయ్ అతిథిగా వెళ్లారు. ఇక ఆ ఎపిసోడ్ కి ఆహా టీం.. విజయ్ నుంచి సాయం పొందిన వ్యక్తిని తీసుకొచ్చి ప్రేక్షకులకు పరిచయం చేసింది.
కరోనా వంటి విపత్తులో లాక్‌డౌన్ తో ప్రతిఒక్కరు ఇబ్బంది పడిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఆ సమయంలో మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ.. ‘మిడిల్ క్లాస్ ఫండ్స్’ పేరుతో విరాళాలు సేకరించి అవసరంలో ఉన్న 10వేలకు పైగా కుటుంబాలకు అందజేశారు. ఆ సమయంలోనే భిక్షాటన చేసుకొనే ఓ ట్రాన్స్‌జెండర్ కూడా సాయం కోసం సోషల్ మీడియా ద్వారా సహాయం కోసం విజయ్ కి దరఖాస్తు పెట్టుకుంది. ఆమె దరఖాస్తు చేసిన కొన్ని నిమిషాల్లోనే విజయ్ టీం నుంచి ఫోన్ కాల్ వెళ్లిందట.
ఇక ఆమె పరిస్థితి తెలుసుకున్న విజయ్.. ఆమెతో పాటు ఉన్న మరో 18 మంది ట్రాన్స్ జెండర్స్‌కు సహాయం అందించారట. ఆ సహాయం అందుకున్న సమయంలో విజయ్ తనకి దేవుడిలా కనిపించారట. కానీ విజయ్ కి మాత్రం కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం రాలేదట. విజయ్ కి కృతజ్ఞతలు చెప్పడానికి రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నానని, అది ఇప్పటికి కుదిరిందని ఆమె చేసుకొస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఆమె మాటలకు విజయ్ రియాక్ట్ అవుతూ.. “అది కేవలం నేను ఒక్కడినే చేసిన సహాయం కాదు. ఎంతోమంది 500. 1000 రూపాయిలు విరాళంగా ఇచ్చి, నా ద్వారా మీకు సాయం అందేలా చేసారు” అని చెప్పుకొచ్చారు. తన చేసిన మంచి పని క్రెడిట్ ని కూడా విజయ్ ఇతరులకు ఇస్తుండడంతో నెటిజెన్స్ రౌడీ బాయ్ ని ప్రశంసిస్తున్నారు.
Thanks cheppakarledhu, if you’re fine, it’s enough – @TheDeverakonda
The man with a golden heart ❤️#VijayDeverakonda pic.twitter.com/HArOPAcGOZ
— Suresh PRO (@SureshPRO_) July 9, 2024