Vijay Deverakonda Confirms : డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ
Vijay Deverakonda - Rashmika Dating : 'నా వయస్సు 35ఏళ్లు. నేనింకా సింగిల్ అని మీరు అనుకుంటున్నారా' అని.. తనకు ఎంతోకాలంగా తెలిసిన, కోస్టార్ తోనే డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు
- By Sudheer Published Date - 01:42 PM, Thu - 21 November 24

తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పై స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. ‘నా వయస్సు 35ఏళ్లు. నేనింకా సింగిల్ అని మీరు అనుకుంటున్నారా’ అని.. తనకు ఎంతోకాలంగా తెలిసిన, కోస్టార్ తోనే డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రష్మిక పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ ఆమెనే అని చెప్పకనే చెప్పాడు.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)..ఈ పేరు చెపితే చాలు యూత్ లో కిక్ వస్తుంది. అర్జున్ రెడ్డి (Arjun Reddy) మూవీ తో యూత్ స్టార్ గా మారిన విజయ్..ఆ తర్వాత గీత గోవిందం (Geetha Govindam) మూవీ తో ఫ్యామిలీ హీరోగా మారాడు. పరుశురాం డైరెక్షన్లో రష్మిక – విజయ్ (Vijay Devarakonda – Rashmika) జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ – రష్మిక కెమిస్ట్రీ (vijay Devarakonda – Rashmika Chemistry) సినిమాకు ప్రాణం పోసింది. ఈ చిత్రం తర్వాత విజయ్ – రష్మిక గురించి అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరు ప్రేమలో (vijay Devarakonda – Rashmika Love) ఉన్నారని ..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని..అందుకే ఇద్దరు కలిసి ఫారెన్ టూర్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారని మాట్లాడుకుంటూ వస్తున్నారు. వీరు మాత్రం మీము మంచి ఫ్రెండ్స్ అని మొన్నటి వరకు చెపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. కుటుంబ సభ్యుల ఫంక్షన్లకు కూడా ఇద్దరు హాజరు అవుతుండడం..పబ్లిక్ గానే ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడంతో త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెపుతారని ఇరు అభిమానులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ లో విజయ్ డేటింగ్ పై ఓపెన్ అయ్యాడు. ” తాను రిలేషన్ లో ఉన్నననీ, తన సహనటుల్లో ఒకరితో డేటింగ్ చేసినట్లు అంగీకరించాడు. నాకు 35 సంవత్సరాలు. నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా? ప్రశ్నించాడు. దీంతో అక్కడ రిపోర్స్.. మీరు ఎప్పుడైనా సహనటుడితో డేటింగ్ చేశారా? అని ప్రశ్నించారు. రొమాంటిక్ రిలేషన్‌షిప్‌కు వెళ్లే ముందు..తాను ఆ వ్యక్తులతో క్లోజ్ ఫ్రెండ్ షిప్ చేస్తానన్నారు. అయినా.. తాను డేట్‌లకు వెళ్లననీ, ఎవరితోనైనా చాలా కాలం ఫ్రెండ్ షిప్ ఉంటుందో వారితోనే మాత్రమే తాను బయటకు వెళ్తానని అన్నారు. తనకు షరతులు లేని ప్రేమ కావాలన్నారు. నాకు ప్రేమించడం తెలుసు, ప్రేమను తీసుకోవడం కూడా తెలుసు. నాకు షరతులు లేని ప్రేమ తెలియదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లి గురించి విజయ్ మాట్లాడుతూ.. ఇది మహిళలకు మరింత సవాలుగా ఉంటుందని, పెళ్లి అనేది ఒకరి కెరీర్‌కు మధ్య రావాల్సిన అవసరం లేదు. వివాహం అనేది మహిళలకు కష్టమనీ, ఎప్పడు మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అవుతారనే వారి ప్రొఫెషన్ పై ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం రష్మిక వరుస క్రేజీ ఆఫర్లతో పాన్ ఇండియా గా కుమ్మేస్తుంటే..విజయ్ మాత్రం వరుస డిజాస్టర్లతో హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
Read Also : Kakinada Collector : కన్నీరు పెట్టుకున్న కాకినాడ జిల్లా కలెక్టర్..సార్ ఎంత ఎమోషన్లా..?