Kakinada Collector : కన్నీరు పెట్టుకున్న కాకినాడ జిల్లా కలెక్టర్..సార్ ఎంత ఎమోషన్లా..?
Kakinada Collector : కాకినాడ జిల్లా కలెక్టర్ (Kakinada Collector) కూడా అందరి ముందు ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు
- By Sudheer Published Date - 01:23 PM, Thu - 21 November 24

ఎంత గొప్పవాడైన..ఎంత పెద్ద ఫోజిషన్ లో ఉన్న ఎప్పుడో ఓసారి కన్నీరు పెట్టుకోక తప్పదు. ఏదోక సందర్భంలో తల్లిదండ్రుల గురించో..తాను పడిన కష్టాలను గుర్తు చేసుకొనే..లేక మరేతర కారణాల వాళ్ళో ఏదోక సమయంలో కన్నీరు అనేది పెట్టుకుంటారు. తాజాగా కాకినాడ జిల్లా కలెక్టర్ (Kakinada Collector) కూడా అందరి ముందు ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు.
కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ (Shan Mohan Sagili) ..ఈరోజు జరిగిన అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సభ (International Children’s Day 2024)లో ఎంతో భావోద్వేగంగా ప్రసంగించారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, గురువుల బాధ్యత మరియు వారి పాత్రను ప్రస్తావిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. “నేటి బాలలు రేపటి దేశ భవిష్యత్తు. విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడం గురువుల బాధ్యత.” కానీ, కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని విస్మరిస్తున్నారు. దీనివల్ల పిల్లల జీవితం నాశనం అవుతుందనే భావోద్వేగానికి గురయ్యారు.
ఎవరైనా ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని పూర్తిగా పాటించకపోతే, పిల్లల జీవితాలకు నష్టం వాటిల్లుతుందని కలెక్టర్ మోహన్ అన్నారు. ఈ సదస్సులో తమ తల్లిదండ్రుల సూచనలకు అనుగుణంగా వారు వృత్తి ధర్మాన్ని పాటించి, ఎటువంటి సమస్య లేకుండా ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు.కొందరు ఉపాధ్యాయుల తీరు సరిగా లేదని.. కొంతమంది చేజేతులలా విద్యార్థుల జీవితాల్ని నాశనం చేస్తున్నారన్నారు. ఒకవేళ వారు సక్రమంగా విధులు నిర్వహించకపోయి ఉంటే ఆ పాపం తమకు తగిలేదంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు.
ఇలాంటి సభల్లో తాను ఎక్కువగా మాట్లాడనని.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మాట్లాడుతున్నట్లు తెలిపారు. కొంతమంది ఉపాధ్యాయులు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు వెళ్లలేమమని.. తమకు దగ్గరలో పోస్టింగులు ఇప్పించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, తనకు తెలిసిన వారితో సిఫార్సులు చేయించేవారని చెప్పుకొచ్చారు కలెక్టర్. ఆ సమయలో ఎంతో బాధగా ఉండేదని.. మరికొందరు తాము ఒక్కరికే పాఠాలు చెప్పలేకపోతున్నామని.. వేరేవారిని నియమించాలని, వైద్య ధ్రువపత్రాలతో తన దగ్గరకు వచ్చేవారని పేర్కొన్నారు. ఇక కలెక్టర్ మాట్లాడిన తీరుకు అక్కడి వారంతా ఎమోషనల్ అయ్యారు.
Read Also : Raashii Khanna stuns in a gorgeous purple dress