HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Devarakonda On Sukumar Project In Liger Promotions

Deverakonda & Sukumar: పుష్ప 2 ఫలితంపైనే సుకుమార్ విజయ్ ప్రాజెక్ట్?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం లైగర్ మీద పెట్టేశాడు. ఆగస్ట్ 25న ఈ చిత్రం రాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా దేశమంతా చుట్టేస్తున్నాడు

  • Author : Anshu Date : 20-08-2022 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay Devarakonda Sukumar
Vijay Devarakonda Sukumar

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం లైగర్ మీద పెట్టేశాడు. ఆగస్ట్ 25న ఈ చిత్రం రాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా దేశమంతా చుట్టేస్తున్నాడు. ఆ తరువాత మళ్లీ పూరి జగన్నాథ్ కాంబోలోనే జన గణ మన అనే చిత్రం చేస్తున్నాడు. దాంతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో క్యూట్ లవ్ స్టోరీని చేస్తున్నాడు. సమంత, విజయ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం పేరు ఖుషి.

ఇక ఈ చిత్రాలు ఇలా ఉండగానే.. గత ఏడాది విజయ్ ఓ ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మన లెక్కల మాస్టారు సుకుమార్ విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని చేయబోతోన్నట్టు ప్రకటించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇది వరకు ఎన్నో రూమర్లు వచ్చాయి. మధ్యలో ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందనే రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా మీద విజయ్ ఓపెన్ అయ్యాడు.

లైగర్ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ మాట్లాడుతూ ఈ విధంగా అనేశాడు. సుకుమార్ పుష్ప 2 సినిమాను కంప్లీట్ చేశాకే.. మా సినిమాను మొదలుపెడతాం అని చెప్పుకొచ్చాడు. అయితే పుష్ప 2 ఇంకా మొదలేకాలేదు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లోకి వస్తుందో లేదో అనేది కూడా తెలియదు. ఈ ఏడాది చివర్లోకెల్లా పుష్ప పార్ట్ 2 మొదలుకానుందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ఫలితంతోనే విజయ్ ప్రాజెక్ట్ స్థాయి కూడా ఉంటుందని తెలుస్తోంది. మరి విజయ్ అప్పటికి తన క్రేజ్‌ ఏ వరకు వెళ్తుందో చూడాలి. లైగర్ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగితే.. సుకుమార్ ప్రాజెక్ట్ ఇంకో రేంజ్‌లో ఉంటుందని అర్థమవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • liger
  • Pushpa 2
  • sukumar
  • tollywood
  • vijay devarakonda

Related News

Shambhala

హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

ట్రేడ్ వర్గాలు కూడా ఈ పోటీని ఆసక్తిగా గమనిస్తున్నాయి. 'ది రాజా సాబ్' ఒక మాస్ ఎంటర్‌టైనర్, హారర్-ఫాంటసీ కాగా శంబాల‌ ఒక ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్.

  • The Raja Saab Sequel

    ప్ర‌భాస్ రాజాసాబ్‌.. పార్ట్‌-2 పేరు ఇదేనా?!

  • Allu Arjun

    లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్‌మెంట్!

  • Sakshi Vaidya

    పవన్ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. ఆ కారణంగానే మూవీ వద్దు అన్నాను : సాక్షి వైద్య

  • Mana Shankara Vara Prasad Garu

    శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్..నెక్స్ట్ వెంకటేశ్‌తో ఫుల్‌లెంగ్త్‌ మూవీ: చిరంజీవి

Latest News

  • ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!

  • త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

  • ‘రాజాసాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

  • భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర ఎంతకి చేరిందంటే..

  • ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ హైకోర్టులో ఊరట

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd