Vijay Devarakonda : ఏంటి విజయ్ దేవరకొండ ఈ సూపర్ హిట్ సినిమాలు వదులుకున్నాడా.. లిస్ట్ లో 100 కోట్ల సినిమా కూడా..!
Vijay Devarakonda యువ హీరోల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా తన క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.
- By Ramesh Published Date - 03:55 PM, Fri - 17 May 24

Vijay Devarakonda యువ హీరోల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా తన క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ తర్వాత 3 క్రేజీ సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇదిలాఉంటే విజయ్ దేవరకొండ టాక్సీవాలా తర్వాత వరుసగా ఫ్లాపులు అందుకుంటున్నాడు. ఖుషి సినిమా జస్ట్ ఓకే అనిపించినా మిగతావన్నీ కూడా నిరాశపరచాయి.
ఐతే విజయ్ దేవరకొండ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాను కూడా అతను కాదనేశాడని టాక్. ఇంతకీ రౌడీ స్టార్ వదిలేసిన సినిమాలు ఏంటి అంటే ఈ లిస్ట్ లో మొదటి సినిమా ఆరెక్స్ 100 అని తెలుస్తుంది. అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రాం హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా విజయ్ కాదన్నాకే రాం దగ్గరకు వచ్చిందని తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా 100 కోట్లు కొట్టిన ఉప్పెన సినిమాను కూడా ముందు విజయ్ దేవరకొండకు చెప్పారట. అయితే తన ఇమేజ్ కి అది సరిపోదని వద్దనాడట విజయ్ దేవరకొండ.
నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చి సక్సెస్ అందుకున్న భీష్మ సినిమా కూడా ముందు విజయ్ దేవరకొండ దగ్గరకే వెళ్లిందట. కానీ అప్పుడు వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల విజయ్ ఆ సినిమా చేయడం కుదరలేదు. అలా విజయ్ కాదని చెప్పిన 4 సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మరి ఆ సినిమాలు కూడా విజయ్ చేసి ఉంటే కెరీర్ ఇంకాస్త దూకుడుగా ఉండేదని చెప్పొచ్చు.
Also Read : Pushpa 2 : పుష్ప 2 స్పెషల్ సాంగ్ అలా ప్లాన్ చేస్తున్నారా.. డబుల్ ధమాకా ఇచ్చేందుకు సిద్ధమా..?