Kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్’ అవుతాడా..? ‘డమ్’ అంటాడా..?
Kingdom : ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాల తరువాత ఆ స్థాయి హిట్ విజయ్ అందుకోలేదు. అంతే కాకుండా ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకున్నాడు
- By Sudheer Published Date - 07:25 PM, Wed - 30 July 25

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆశలన్నీ కింగ్డమ్ (Kingdom ) మీదనే పెట్టుకున్నాడు. మరికొద్ది గంటల్లో ఈ మూవీ థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌లో కీలకమైన మలుపు అవుతుందనే అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాల తరువాత ఆ స్థాయి హిట్ విజయ్ అందుకోలేదు. అంతే కాకుండా ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకున్నాడు. దీంతో కింగ్ డమ్ ప్రమోషన్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, నెగటివ్ ప్రాచారానికి అవకాశం ఇవ్వకుండా, సినిమా రిలీజ్ అయ్యే వరకు మాట్లాడకూడదని నిర్ణయించుకోవడం విశేషం. ఆయనకు మళ్లీ తన క్రేజ్ నిలుపుకోవాలంటే ఈ సినిమా బిగ్ హిట్ కావాల్సిందే. కేవలం విజయ్ కి మాత్రమే కాదు ఈ సినిమా పై చాలామంది చాల ఆశలు పెట్టుకున్నారు.
Internal Security System: దేశ రాజధాని అంతర్గత భద్రతా వ్యవస్థ బలోపేతం దిశగా చర్యలు!
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో పరిచయమైనా, ఆ చిత్రం ఫలితంగా ఆమెకు విజయాలు రాలేదు. అయినా, ఆమెకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ‘కింగ్‌డమ్’లో ఆమె పాత్ర సాంప్రదాయ హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా ప్రత్యేకంగా డిజైన్ చేశారని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పారు. ఈ సినిమా హిట్ అయితే ఆమె కెరీర్ మరింత వేగంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న క్రేజ్‌కు ఇప్పుడు హిట్ కలిసివస్తే ఆమెకు పకడ్బందీ స్థానం ఏర్పడుతుంది.
ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. భారీగా లాభపడిన పంత్, జడేజా
సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా, థియేటర్లలో మంచి ఇంపాక్ట్ చూపిస్తాయని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది. అనిరుధ్ సంగీతం తమిళ్ చిత్రాల్లో సూపర్ హిట్ అయినప్పటికీ , తెలుగు లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాతో ఆ విమర్శలకు బదులిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’తో తన ప్రతిభను నిరూపించుకున్నప్పటికీ, హిందీ రీమేక్ బలహీనంగా నిలిచింది. ఈ సినిమాతో మళ్లీ తన క్లాస్ చూపించాలన్న పట్టుదల గౌతమ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మాత నాగవంశీ సైతం వరుస ప్లాప్స్ తో ఇంబ్బందిలోనే ఉన్నాడు. సో వీరిద్దర్నీ ఆశలు కింగ్డమ్ పైనే ఉన్నాయి. మరి వీరి జాతకాలను కింగ్ డమ్ ఎంతవరకు మారుస్తుందో చూడాలి.