Vijay Devarakonda : శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ..!
Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.
- By Ramesh Published Date - 10:57 PM, Thu - 4 July 24
![Vijay Devarakonda : శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/Two-Heroes-Rejected-Vijay-Devarakonda-Pics-that-movie-Rahul-Sankrityan.jpg)
Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఈ సినిమా డిఫరెంట్ సినిమాగా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా ముందు శ్రీలీలని అనుకున్నా ఆమె ప్లేస్ లో రవితేజ తో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్న భాగ్య శ్రీ కి ఛాన్స్ ఇచ్చారు.
ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ కొంత పార్ట్ పూర్తి కాగా నెక్స్ట్ షెడ్యూల్ శ్రీలంకలో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 6 నుంచి అక్కడ యాక్షన్ సీన్స్ చేస్తారని టాక్. దాదాపు 40 రోజుల దాకా అక్కడే షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాతో పాటుగా రవికిరణ్ డైరెక్షన్ లో ఒక సినిమా.. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ 3 సినిమాలతో భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడని అర్ధమవుతుంది. కచ్చితంగా విజయ్ దేవరకొండ స్టామినా ఈ సినిమాలతో ప్రూవ్ అయ్యేలా చేయాలని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Viswak Sen Deactivate his Instagram Account Fans Shock : విశ్వక్ సేన్ గుడ్ బై చెప్పేశాడు.. ఫ్యాన్స్ కి ఇలా షాక్ ఇచ్చాడేంటి..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/02/Viswak-Sen-about-Arjun-Issue-at-Gami-Promotions.jpg)
Viswak Sen Deactivate his Instagram Account Fans Shock : విశ్వక్ సేన్ గుడ్ బై చెప్పేశాడు.. ఫ్యాన్స్ కి ఇలా షాక్ ఇచ్చాడేంటి..?
ట్విట్టర్ ఖాతాలో ఆ విషయన్ని చెబుతూ కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నా అంటూ