Meera Suicide: మీరాకి చీకటి అంటే భయం.. ఆత్మహత్యకు కారణం ఇదేనా?
కూతురు ఆత్మహత్యతో విజయ్ ఆంటోని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కుమార్తె మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
- Author : Praveen Aluthuru
Date : 21-09-2023 - 6:49 IST
Published By : Hashtagu Telugu Desk
Meera Suicide: కూతురు ఆత్మహత్యతో విజయ్ ఆంటోని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కుమార్తె మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మీరా మీరా 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య ఘటన కోలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇంత చిన్న వయసులోనే బాలిక ఆత్మహత్యకు గల కారణాలపై పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని తెలుస్తోంది.
మీరా చదువుల కారణంగా కొంత కాలంగా మానసిక ఒత్తిడికి గురవుతోందని, కొంతకాలంగా చికిత్స కూడా తీసుకుంటోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మీరా ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ.. విజయ్ ఆంటోని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
మీరాకి చీకటి అంటే చాలా భయం అని వాళ్ల అమ్మమ్మ (విజయ్ ఆంటోని తల్లి) చెప్పింది. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, కాసేపు చీకట్లో ఉండాలన్నా భయపడే ఓ అమ్మాయి ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఎలా సాహసించిందో అర్థం కావడం లేదు. పిల్లలను అమితంగా ఇష్టపడే విజయ్‌కి ఇలా జరగడం చాలా దురదృష్టకరం . ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా భయం, డిప్రెషన్ వంటి సున్నితమైన అంశాలపై చర్చ సాగుతోంది.
Also Read: Nandigam Suresh : లోకేష్ కూడా వెన్నుపోటు పొడుస్తాడు బాబుని.. లోకేష్ వల్లే బాబుకి ప్రాణహాని..