Vetrimaran : రజిని, విజయ్ లు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి..!
Vetrimaran ఓటీటీ డీల్ అయిపోయింది కాబట్టి సినిమా బడ్జెట్ హీరోల రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఐతే సినిమా సగం లో ఉండగా ఓటీటీలు ప్లేట్
- By Ramesh Published Date - 09:45 AM, Wed - 25 September 24

సినిమా బడ్జెట్ ని పెంచేది హీరోల రెమ్యునరేషనే అంటూ కొందరు మాట్లాడుతుంటారు. సినిమా కోసం మిగతా క్రూ ఎంత కష్టపడినా టికెట్లు తెగేది మాత్రం హీరోల ఇమేజ్ వల్లే. ఐతే వారికి ఇస్తున్న రెమ్యునరేషన్ గురించి రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఈమధ్యనే మరోసారి డైరెక్టర్స్ మీట్ లో ఇలాంటి కామెంట్స్ చేశారు తమిళ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaran). రజిని (Rajinikanth), విజయ్ లాంటి వాళ్లు రెమ్యునరేషన్ తగ్గించుకుంటేనే క్వాలిటీ సినిమాలు వస్తాయని అన్నారు.
సినిమా హిరోలు రెమ్యునరేషన్ పెంచడం వల్ల బడ్జెట్ పెరుగుతుందని అంతేకాదు ఓటీటీ (OTT)లు వారి సినిమాలకు ముందే 100 కోట్ల ఆఫర్లు ఇస్తున్నారని అన్నారు. స్టార్ హీరోల సినిమాలకు 120 కోట్ల దాకా ఓటీటీలు ముందే ఆఫర్ చేస్తున్నారు. ఓటీటీ డీల్ అయిపోయింది కాబట్టి సినిమా బడ్జెట్ హీరోల రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఐతే సినిమా సగం లో ఉండగా ఓటీటీలు ప్లేట్ తిప్పేస్తునాయి. అంత ఇవ్వలేమని చెబుతున్నాయి. దాని వల్ల నిర్మాత మీఅ భారం పెరుగుతుందని ఆయన అన్నారు.
బడ్జెట్ లో సూపర్ హిట్..
తమిళంలో మారి సెల్వరాజ్ అద్భుతమైన సినిమాలు చేస్తున్నారని. ఆయన సినిమా లో బడ్జెట్ లో సూపర్ హిట్ అవుతున్నాయని అన్నారు. హీరోల రెమ్యునరేషన్ తగ్గించి ఆ బడ్జెట్ సినిమా క్వాలిటీకి పెడితే బెటర్ అని అన్నారు. ఇదే చర్చలో కరణ్ జోహార్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు. కిల్ సినిమాను ఒక స్టార్ ని చేయమంటే 40 కోట్లు అడిగాడు. అంటే సినిమా 40 ప్లస్ ఆ హీరోకి 40 అంటే 120 కోట్లు సినిమా వసూలు చేస్తుందా అని అతన్ని అడిగానని కరణ్ జోహార్ (Karan Johar) చెప్పారు.
అందుకే తను కిల్ సినిమా కొత్త వాళ్లతో చేశానని అన్నారు. ఐతే సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుందని హీరోల పారితోషికం తగ్గించమనడం కరెక్ట్ కాదు కానీ సినిమా బడ్జెట్ తగ్గించి క్వాలిటీ పెంచేలా మరో విధంగా ఆలోచించాలని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read : Devara Triple Role : దేవర ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్..?