Kaikala Satyanarayana: నవరస నటసార్వభౌమ.. వి మిస్ యూ!
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి తెలగు తెరపై తనదైన ముద్ర వేశాడు.
- By Balu J Published Date - 11:34 AM, Fri - 23 December 22

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని తన తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, కమెడియన్ ఇలా అన్నీ రకాల ప్రాతలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు కైకాల నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు సత్యనారాయణ. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. కైకాల మరణ వార్తతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు.
నట ప్రస్థానం
కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935 జులై 25న జన్మించారు
• గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడైయ్యాడు
• 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది
•కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు
• నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల
♦ కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్‌కు డూపుగా నటించారు.
♦1960లో ఎన్టీఆర్ చొరవతోనే ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’లో అతిథి పాత్రలో మెరిశారు.
♦ఆ తర్వాత సత్యనారాయణ టాలెంట్ గుర్తించిన విఠలాచార్య ‘కనకదుర్గ పూజా మహిమ’లో సేనాధిపతి పాత్ర ఇచ్చారు.
♦ఇది సత్యనారాయణ కెరీర్‌ను నిలబెట్టింది.
• కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు
•కైకాల సత్యనారాయణ నటించిన చివరి చిత్రం: మహర్షి
ఎన్నో అవార్డులు
రమా ఫిలిమ్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన సత్యనారాయణ ‘గజదొంగ’, ‘ఇద్దరు దొంగలు’, ‘కొదమ సింహం’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దుల మొగుడు’ వంటి చిత్రాలను తీశారు. కొన్ని చిత్రాలకు చిరంజీవి సహ నిర్మాతగా వ్యవహరించారు.
♦సత్యనారాయణ తన కెరీర్‌లో చిన్నా, పెద్దా వేషాలు కలిపి 800లకు పైగా పాత్రలు పోషించారు.
♦దాదాపు 200మంది దర్శకులతో పనిచేశారు.
♦అభిమానులు, కళా సంస్థలు సత్యనారాయణ నటనను మెచ్చి ఎన్నో బిరుదులు ఇచ్చాయి.
♦‘కళా ప్రపూర్ణ’, ‘నవరస నటనా సార్వభౌమ’ ఇలా ఎన్నో అందుకున్నారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సత్యనారాయణకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది.
♦ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.
ప్రముఖ నటుడు శ్రీ కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. తెలుగు చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూ, తమ వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు.
— Telangana CMO (@TelanganaCMO) December 23, 2022
గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/eJdUwqnINz
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2022