Venkatesh Saindhav : సంక్రాంతికి సైంధవ్.. బిగ్ ఫైట్..!
శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సైంధవ్ (Venkatesh Saindhav) కూడా సంక్రాంతికి వచ్చేస్తున్న
- By Ramesh Published Date - 08:21 PM, Mon - 2 October 23

2024 పొంగల్ రేసులో మరో సినిమా దిగుతుంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం, మాస్ మహారాజ్ రవితేజ ఈగల్, కింగ్ నాగార్జున నా సామి రంగ సినిమాలు సంక్రాంతి ఫైట్ కి సిద్ధమయ్యాయి. వీటితో పాటుగా ఇండియన్ సూపర్ హీరో మూవీ అంటూ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న హనుమాన్ కూడా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ సైంధవ్ (Venkatesh Saindhav) కూడా సంక్రాంతికి వచ్చేస్తున్న అంటున్నాడు.
శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సైంధవ్ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన వెంకటేష్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కినట్లు తెలుస్తుంది. హిట్ ఫ్రాంచైజ్ లలో హిట్ ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్ సినిమాలతో హిట్ అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను వెంకటేష్ తో ఒక డిఫరెంట్ కథతో వస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. మెడికల్ మాఫియా నేపథ్యంతో ఈ సినిమా వస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. కొన్నాలుగా వెంకటేష్ ఎంటర్టైన్మెంట్ సినిమాలే చేయడం వల్ల ఆయనలోని మాస్ యాంగిల్ విక్టరీ ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. అది గుర్తించిన శైలేష్ కొలను వెంకటేష్ తో సైంధవ్ అంటూ భారీ మూవీతో వస్తున్నాడు.
We’re now on WhatsApp. Click to Join
ఈ సినిమాను అసలైతే డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అనూహ్యంగా రేసులో ప్రభాస్ సలార్ దిగుతుండటం వల్ల అన్ని సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి. క్రిస్మస్ కి నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లు కూడా రిలీజ్ ప్లాన్ చేశారు. సలార్ వస్తుండటం వల్ల ఈ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. వెంకటేష్ సైంధవ్ సినిమాను జనవరి 13న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా రావడంతో సంక్రాంతి ఫైట్ మరింత క్రేజీగా మారింది.
మహేష్ గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్ వీటితోపాటు రవితేజ ఈగల్ ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు వస్తున్నాయి. ఈ సినిమాల మధ్య ఫైట్ కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ.. ఆ ఫెస్టివల్ మోడ్ ని డబుల్ చేసేందుకు ఆడియన్స్ కు ఖుషిని అందిస్తాయి. మరి సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది చూడాలి.
Also Read : Mega Project : మెగా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందా..?