Venkatesh Romance with Two Heroines : వెంకటేష్ తో ఆ ఇద్దరు భామల రొమాన్స్..!
తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అక్కడ దళపతి విజయ్ తో G.O.A.T సినిమాలో నటిస్తుంది. తెలుగులో ఆల్రెడీ వరుణ్ తేజ్ తో మట్కా సినిమాలో
- Author : Ramesh
Date : 08-07-2024 - 1:32 IST
Published By : Hashtagu Telugu Desk
విక్టరీ వెంకటేష్ సైంధవ్ తర్వాత అనీల్ రావిపుడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు ఈమధ్యనే జరిగాయి. ఐతే ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు ఇద్దరు కథానాయికలు స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుంది. వెంకటేష్ తో నటించే ఆ ఇద్దరు ఎవరు అంటే ఒకరు మీనాక్షి చౌదరి కాగా మొరొకరు ఐశ్వర్య రాజేష్ అని తెలుస్తుంది.
మీనాక్షి చౌదరి తెలుగులో బిజీ హీరోయిన్ గా మారుతుంది. యువ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా అమ్మడు ఛాన్సులు అందుకుంటుంది. మీనాక్షి చౌదరి (Meenakshi chaudhary) తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అక్కడ దళపతి విజయ్ తో G.O.A.T సినిమాలో నటిస్తుంది. తెలుగులో ఆల్రెడీ వరుణ్ తేజ్ తో మట్కా సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ సినిమాలో నటిస్తుంది.
ఇక ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) విషయానికి వస్తే తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెప్పిస్తున్న అమ్మడికి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఐతే తెలుగులో మాత్రం తనని సరిగా గుర్తించట్లేదని చెప్పొచ్చు. ఐశ్వర్యా రాజేష్ ఇప్పటికే నాలుగైదు తెలుగు సినిమాల్లో నటించింది. ఐతే ఈ సినిమాల వల్ల ఆమెకు పెద్దగా పాపులారిటీ రాలేదు. వెంకటేష్ (Venkatesh) సినిమాతో అమ్మడు కచ్చితంగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది.
అనీల్ రావిపుడితో F2, F3 సినిమాలు చేసిన వెంకటేష్ మరోసారి హ్యాట్రిక్ మూవీని చేస్తున్నాడు. ఈ సినిమా కాస్త ఎమోషనల్ టచ్ ఇస్తూ ఎంటర్టైనింగ్ గా సాగుతుందట. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. వెంకటేష్ అనీల్ రావిపుడి సినిమా సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ ని పరిశీలిస్తున్నారు. సో టైటిల్ లోనే సంక్రాంతి ఉంది అంటే సినిమా పొంగల్ రిలీజ్ టార్గెట్ తో వస్తుందని చెప్పొచ్చు. సైంధవ్ తో నిరాశపరచిన వెంకటేష్ ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు.
Also Read : Vijay Sethupathi Maharaja OTT Release Date Lock : సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందహో..!