Venkatesh : అరకులో వెంకటేష్ సినిమా సందడి.. సంక్రాంతికి వచ్చే ప్లాన్ లో భాగంగా..!
Venkatesh ఈ సినిమా షూటింగ్ అరకులో జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. అరకులో ఫైనల్ షెడ్యూల్ ని మొదలు పెట్టారు అనీల్ రావిపుడి అండ్ టీం.
- By Ramesh Published Date - 07:29 PM, Sun - 10 November 24

విక్టరీ వెంకటేష్ సైంధవ్ తర్వాత అనీల్ రావిపుడి (Anil Ravipudi) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం (Sankrathiki Vastunnam) టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించబోతున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది.
అదే సంక్రాంతికి వెంకటేష్ (Venkatesh) సినిమా కూడా వస్తుంది. ఐతే ఈ సినిమా ఎంటర్టైనింగ్ గా వెంకటేష్ మార్క్ మూవీగా వస్తుంది. ఐతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకులో జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. అరకులో ఫైనల్ షెడ్యూల్ ని మొదలు పెట్టారు అనీల్ రావిపుడి అండ్ టీం. అక్కడ షూటింగ్ పూర్తి కాగానే సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుందని తెలుస్తుంది.
పక్కా ఎంటర్టైనర్ గా..
సంక్రాంతికి ఈ సినిమా పక్కా ఎంటర్టైనర్ గా నిలిచేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అరకులో వెంకటేష్ కి సంబందించిన కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. వెంకటేష్ తో F2, F3 సినిమాలు చేశాడు అనీల్ రావిపుడి. ఈ రెండు సినిమాలు సక్సెస్ అందుకోవడంతో ఈ ఇద్దరు కలిసి హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు.
సైంధవ్ సినిమా విషయంలో తన అంచనాలు ఫెయిల్ అవ్వడంతో వెంకటేష్ చాలా డిజప్పాయింటెడ్ గా ఉన్నాడు. అందుకే ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టేలా చూస్తున్నాడు.
Also Read : Chiranjeevi – Ka : ‘క’ చిత్ర యూనిట్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి