Varun Tej Wedding : వరుణ్ తేజ్ వివాహ ముహూర్తం ఫిక్స్ ..
నవంబర్ 01 న వీరి వివాహం ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. వివాహం ఇటలీలో జరిగినా..హైదరాబాద్ తో పాటుగా డెహ్రాడూన్ లోనూ రిసిప్షెన్ ఏర్పాటు చేస్తున్నారు.
- Author : Sudheer
Date : 08-10-2023 - 12:25 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi ) ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మధ్యనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుగగా..నవంబర్ 01 న వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా చిరంజీవి ఇంటా ప్రీ వెడ్డింగ్ షూట్ (Varun Tej Pre Wedding Shoot) జరుగగా..ఈ షూట్ లో కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక నవంబర్ 01 న వీరి వివాహం (Varun Tej Lavanya Tripathi Wedding ) ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. వివాహం ఇటలీలో జరిగినా..హైదరాబాద్ తో పాటుగా డెహ్రాడూన్ లోనూ రిసిప్షెన్ ఏర్పాటు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ లో పెరగటం తో అక్కడ కూడా రిసిప్షెన్ కు నిర్ణయించారు. ఇటలీ మధ్య ప్రాంతంలో ప్రకృతి రమణీయతకు మారుపేరుగా టస్కనీ ప్రఖ్యాతిగాంచింది. టస్కనీ రాజధాని ఫ్లోరెన్స్ అపురూప శిల్పకళా సంపదకు నిలయంగా వర్ధిల్లుతోంది. ఇక్కడ ఎల్బా ప్రాంతంలోని బీచ్ లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇక అక్కడే వరుణ్, లావణ్య వివాహం జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటగా మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో మిస్టర్ సినిమ షూటింగ్ ఇటలీలోనే జరిగింది. ఆ సమయంలోనే వీరి మధ్య లవ్ ట్రాక్ మొదలైనట్లు తెలుస్తుంది.
Read Also : Vangaveeti Radha Wedding : వంగవీటి రాధా పెళ్లి ముహూర్తం ఫిక్స్..