Samantha : షూటింగ్ లో స్ప్రుహ తప్పిపడిపోయిన సమంత..!
Samantha ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ తో బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించిన సమంత మరోసారి సిటాడెల్ సీరీస్ తో సర్ ప్రైజ్ చేసింది. ఐతే ఈ సీరీస్ చేస్తున్న టైం లో ఆమె మయోసైటిస్
- By Ramesh Published Date - 07:46 AM, Wed - 13 November 24

సిటాడెల్ వెబ్ సీరీస్ తో మరోసారి సమంత ఆడియన్స్ ని అలరించింది. వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి ఆమె చేసిన సిటాడెల్ హనీ బన్నీ సీరీస్ రీసెంట్ గా రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సీరీస్ కోసం సమంత చాలా కష్టపడింది. ఈ సీరీస్ లో సమంత హాట్నెస్ ఆమెలోని ఫైర్ ని అందరికీ తెలిసేలా చేస్తుంది.
ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ తో బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించిన సమంత మరోసారి సిటాడెల్ సీరీస్ తో సర్ ప్రైజ్ చేసింది. ఐతే ఈ సీరీస్ చేస్తున్న టైం లో ఆమె మయోసైటిస్ వల్ల బాధపడుతుంది. అయినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ లో పాల్గొన్నది. ఐతే ఒక దశలో శరీరం తనకు సహకరించపోయినా సమంత (Samantha) కాల్ షీట్ ఇచ్చాం కదా అని షూటింగ్ కి వెళ్లింది.
షూటింగ్ క్యాన్సిల్..
సిటాడెల్ (Citadel) హనీ బన్నీ షూటింగ్ లో సమంత స్ప్రుహ కోల్పోయిందని వరుణ్ ధావన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. షూటింగ్ లో సడెన్ గా ఆమె స్ప్రుహ కోల్పోయింది. ఏమైందో అని యూనిట్ అంతా చాలా కంగారు పడ్డాం. షూటింగ్ క్యాన్సిల్ చేద్దామని డిసైడ్ అయ్యాం. కానీ సమంత మళ్లీ మేల్కొని షూటింగ్ లో జాయిన్ అయ్యింది.
ప్రస్తుతం సమంత బాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆమె సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం (Bangaram) సినిమా చేస్తుంది. ఐతే ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రావట్లేదు.
Also Read : Allu Arjun Pushpa 2 : పుష్ప 2 ట్రైలర్ వచ్చేస్తుందహో..!