HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Varasudu Is An Out And Out Pure Family Entertainer Its Like A Festival Hero Srikanth Interview

Varasudu: ‘వారసుడు’ అవుట్ అండ్ అవుట్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఒక పండగలా వుంటుంది: హీరో శ్రీకాంత్ ఇంటర్వ్యూ

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

  • By Anshu Published Date - 07:29 PM, Tue - 3 January 23
  • daily-hunt
C739bc3f Ef93 43f3 Bd57 8400d7dd4a1d
C739bc3f Ef93 43f3 Bd57 8400d7dd4a1d

Varasudu: దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ‘వారసుడు’ చిత్ర విశేషాలని పంచుకున్నారు.

విజయ్ ‘వారసుడు’ సినిమాతో మీ జర్నీ ఎలా మొదలైయింది ? సినిమా ఎలా వుండబోతుంది ?
నా కెరీర్ లో తమిళ్ సినిమా చేయడం ఇదే తొలిసారి. దర్శకుడు వంశీ పైడిపల్లి వారసుడు కథ చెప్పారు. ఇందులో విజయ్ కి బ్రదర్ గా కనిపిస్తా. చాలా కీలకమైన పాత్ర ఇది. ‘వారసుడు’ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అద్భుతమైన హ్యుమన్ ఎమోషన్స్ వుంటాయి. సినిమా ఒక దృశ్యకావ్యంలా వుంటుంది. విజువల్స్ అద్భుతంగా వుంటాయి. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో చేసినప్పటికీ ఇది పక్కా తెలుగు సినిమాలానే వుంటుంది. రష్మిక, జయసుధ గారు , నేను, కిక్ శ్యామ్ , శరత్ కుమార్, సంగీత, ప్రభు.. ఇలా అందరం తెలుగులో సినిమాలు చేసిన వారే వుండటంతో ఇది పూర్తి తెలుగు నేటివిటీ వున్న సినిమాలానే వుంటుంది.

ఇందులో మీది పాజిటివ్ క్యారెక్టరా ? నెగిటివ్ నా ?
బ్రదర్స్ మధ్య జరిగే ఎమోషన్స్ ఇందులో వుంటాయి. బ్రదర్స్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయో .. అన్నీ చక్కగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా వుంటుంది. వంశీ పైడిపల్లి సినిమాల్లో గ్రేట్ ఎమోషన్స్ వుంటాయి. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. విజయ్ కి అద్భుతమైన క్రేజ్ వుంది. ఈ మధ్య కాలంలో ఆయన కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేయలేదు. దర్శకుడు వంశీ పైడిపల్లి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వారసుడిని తెరకెక్కించారు. ఇందులో నా పాత్ర మొదటి నుండి చివరి వరకూ వుంటుంది. విజయ్ లాంటి స్టార్ హీరో తో ఒక మంచి సినిమాతో తమిళంలో అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా వుంది.

విజయ్ గారిలో ఎలాంటి ప్రత్యేకతలు గమనించారు ?
ఇంత కుముందు కొన్ని వేడుకల్లో కలిశాను. కలిసి పని చేయడం ఇదే తొలిసారి. విజయ్ చాలా సైలెంట్ గా వుంటారు. ఎక్కువగా మాట్లాడరు. క్యారీవాన్ వాడరు. సెల్ ఫోన్ దగ్గర వుండదు. ఒకసారి సెట్ లో అడు గు పెడితే ప్యాకప్ చెప్పినంతవరకూ అక్కడ నుండి కదలరు. చాలా అంకితభావంతో పని చేస్తారు.

‘వారసుడు’ సంక్రాంతి కి వచ్చే సినిమాలకి పోటి అంటున్నారు ?
ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియాలా అయిపోయాయి. మన తెలుగు సినిమాలు కూడా అక్కడ హిట్లు కొడుతున్నాయి. సంక్రాంతి సినిమాల పండగ కూడా. అన్ని సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారు. వారసుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్. పండగకి పండగ లాంటి సినిమా.

మీకు, విజయ్ గారి మధ్య సెంటిమెంట్, ఎమోషన్స్, పోటాపోటీ సీన్స్ ఉన్నాయా ?
వున్నాయి. ఒక ఫ్యామిలీ లో అన్నదమ్ముల మధ్య ఎలాంటి పరిస్థితులు, గొడవలు ఉంటాయో అలాంటి సీన్స్ వుంటాయి.

డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో పని చేయడం ఎలా అనిపించింది
వంశీ పైడిపల్లి చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఫిలిం మేకింగ్ లో చాలా పెర్ఫెక్షన్ వుంటుంది. ఎక్కడా రాజీపడకుండా తీస్తారు.

తమన్ మ్యూజిక్ గురించి ?
ఇప్పటికే రంజితమే, అమ్మ పాట, శింబు పాడిన పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. రిరికార్డింగ్ అద్భుతంగా చేశాడు.

నిర్మాత దిల్ రాజు గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో వున్నప్పటికీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేయడం ఇదే తొలిసారి. అలాగే శంకర్ గారి సినిమాలో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను.

వారసుడు లో యాక్షన్ ఎలా వుంటుంది ?
యాక్షన్ వుంటుంది. ఐతే అది నేను చేయను (నవ్వుతూ). ఇందులో చాలా మంచి ఫైట్స్ వుంటాయి. అవి కూడా చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటాయి.

అఖండ లో విలన్ గా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ రోల్ చేస్తున్నారు కదా.. ఇకపై ఇలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తారా ?
అఖండ తర్వాత డిఫరెంట్ గా వుండాలని ఈ పాత్ర చేశాను. అలాగే శంకర్ రామ్ చరణ్ సినిమా చేస్తున్నాను. అందులో మరో డిఫరెంట్ క్యారెక్టర్. డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనే ఆలోచన వుంది. కథ, క్యారెక్టర్ నచ్చితే ఖచ్చితంగా చేస్తాను.

సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ?
సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ సినిమాలు బాగా ఆడాలి. అదే హ్యాపీ సంక్రాంతి.

ఆల్ ది బెస్ట్
థాంక్స్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • srikanth
  • tollywood
  • varasudu

Related News

Chevella Road Accident Bala

Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రంగారెడ్డ

    Latest News

    • IPL 2026 Retention List: డిసెంబ‌ర్‌లో ఐపీఎల్ మినీ వేలం.. ఈసారి ఒక్క‌రోజు మాత్ర‌మే!

    • Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    • IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవ‌సం!

    Trending News

      • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd