Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి నుంచి ఉయ్యాలో ఉయ్యాలా వీడియో సాంగ్ రిలీజ్
భగవంత్ కేసరి సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 03:46 PM, Sat - 18 November 23

Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ సూపర్‌హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీలీల (sreeleela) కీలక పాత్ర పోషించారు. ఆసక్తికర అంశంతో సిద్ధమైన ఈ చిత్రంలోని ‘ఉయ్యాలో ఉయ్యాలా’ పాట ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి (BobbyKolli) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఎలా వస్తోంది, ఎలా జరుగుతోంది అనే విషయాలపై బాలయ్య అభిమానులు ఇప్పట్నుంచే ఆసక్తి చూపుతున్నారు. అలాగే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ (NandamuriMokshagna) కూడా త్వరలోనే ఆరంగేట్రం చేయనున్నాడని బాలయ్య అభిమానులు చర్చించుకుంటుండగా, హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.