Urvashi Rautela : క్రికెటర్ గురించి హాట్ బ్యూటీ నో కామెంట్ అనేస్తుంది..!
Urvashi Rautela బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా బాలీవుడ్ ఆడియన్స్ ని తన మత్తులో పడేస్తున్న విషయం తెలిసినే. గ్లామర్ షోలో తన తర్వాతే ఎవరైనా అనే రేంజ్ లో
- By Ramesh Published Date - 11:31 AM, Sun - 5 May 24

Urvashi Rautela బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా బాలీవుడ్ ఆడియన్స్ ని తన మత్తులో పడేస్తున్న విషయం తెలిసినే. గ్లామర్ షోలో తన తర్వాతే ఎవరైనా అనే రేంజ్ లో అమ్మడు అందాలను ప్రదర్శిస్తుంది. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్, సీరీస్ లతో మెప్పిస్తూ వస్తున్న ఊర్వశి తెలుగులో కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది.
చిరుతో బాస్ పార్టీ సాంగ్ చేసిన ఊర్వశి స్కందాలో రాం తో కూడా ఆడిపాడింది. ఇక ఈ అమ్మడు టీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ తో గొడవ పడిన విషయం తెలిసిందే. రిషబ్ ని టార్గెట్ చేస్తూ ఊర్వశి చాలాసార్లు కామెంట్స్ చేసింది.
రిషబ్ పంత్ ఊర్వశిల మధ్య ఏం జరిగింది అన్నది క్లారిటీ రాలేదు కానీ రిషబ్ అంటే చాలు అంతెత్తున లేస్తుంది అమ్మడు. ఆర్పీ అంటూ రిషబ్ ని అతని ఫ్యాన్స్ ని ఊర్వశి టీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ గా అమ్మడు రిషబ్ పంత్ గురించి మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన ఊర్వశి రిషబ్ పంత్ గురించి మాట్లాడండి అని అడిగితే నో కామెంట్ అనేసింది.
ఇదివరకు ఛాన్స్ ఉన్నా లేకపోయినా సోషల్ మీడియా వేదికగా రిషబ్ మీద తన కోపాన్ని ప్రదర్శించిన ఊర్వశి సడెన్ గా ఇలా సైలెంట్ అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే రిషబ్ పంత్ లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ కు గురయ్యాడు అప్పటి నుంచి రిషన్ గురించి ఊర్వశి సైలెంట్ అయ్యిందని టాక్.
Also Read : Fahad Fazil Aavesham OTT : ఫహద్ ఫాజిల్ ఆవేశం OTT రిలీజ్ ఎప్పుడు..?