Ram Charan – Upasana : మెగా వారసురాలు వచ్చేసింది.. డెలివరీ అయిన ఉపాసన..
జూన్ 19 నిన్న రాత్రి ఉపాసన అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయింది. చరణ్ కూడా ఆమె వెంటే ఉన్నాడు. ఇవాళ తెల్లవారు జామున ఉపాసన డెలివరీ అయి పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది.
- By News Desk Published Date - 07:09 AM, Tue - 20 June 23

రామ్ చరణ్(Ram Charan) – ఉపాసన(Upasana) తల్లితండ్రులు కాబోతున్నారని ఇటీవల కొన్ని నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్ళైన పదేళ్ల తర్వాత ఉపాసన ప్రగ్నెంట్(Pregnant) అవ్వడంతో మెగా ఫ్యామిలి(Mega Family)లో అందరూ ఫుల్ సంతోషంగా ఉన్నారు. ఉపాసన ప్రగ్నెంట్ అని ప్రకటించిన దగ్గర్నుంచి ఆమెకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి.
జూన్ 19 నిన్న రాత్రి ఉపాసన అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయింది. చరణ్ కూడా ఆమె వెంటే ఉన్నాడు. ఇవాళ తెల్లవారు జామున ఉపాసన డెలివరీ అయి పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు నెలకొన్నాయి. చిరంజీవి, మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా ఇప్పుడే అపోలో హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. ఉపాసన ఆడపిల్లకు జన్మనిచ్చిందని, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమమని ఈ మేరకు అపోలో సంస్థ బులెటిన్ విడుదల చేసింది.
అలాగే పలువురు మెగా అభిమానులు కూడా అపోలో హాస్పిటల్ వద్దకు చేరుకొని సంబరాలు నిర్వహిస్తున్నారు. మెగా వారసురాలు వచ్చేసిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు చరణ్ – ఉపాసనలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : Upasana: చిరు ఇంట్లో ఉపాసనకు బేబీ షవర్.. నెట్టింట్లో ఫొటోస్ వైరల్?