Unstoppable Season 4 : బాలయ్య తో లక్కీ భాస్కర్ సందడి
Unstoppable Season 4 : దుల్కర్ సల్మాన్ సహా మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరి, నాగవంశీ 'అన్‌స్టాపబుల్ 4' షో లో సందడి చేసారు
- By Sudheer Published Date - 08:44 PM, Tue - 29 October 24

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న అహా ఓటీటీ ‘అన్‌స్టాపబుల్ 4’ (Unstoppable with NBK ) సీజన్ మొదలైంది. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కావడంతో..ఈ సీజన్ అంతకు మించి ఉండబోతుందని అంత భావిస్తున్నారు. ఇక ఈ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ కు బాలయ్య బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) హాజరై మంచి ఓపెనింగ్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ సరదాగా, ఆసక్తికర ప్రశ్నలతో సాగింది. ఇక ఇప్పుడు రెండో ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ సందడి చేసారు.
వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). ఈ చిత్రంలో ఆయన సరసన మీనాక్షి చౌదరి (Minakshi Choudhury) నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments)పై ఈ సినిమా తెరకెక్కుతుంది. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో దుల్కర్ సల్మాన్ సహా మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరి, నాగవంశీ ‘అన్‌స్టాపబుల్ 4’ షో లో సందడి చేసారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన రాత్రి 7 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ సినిమా తాలూకా అనేక విశేషాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ప్రోమో ఆసక్తి రేపుతోంది.
Read Also : Samanta Legal Notice : చైతుకు సమంత లీగల్ నోటీస్..?