HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Unstoppable Season 2 Host For Megastar Chiranjeevi

Unstoppable Show: ‘చిరు’కు సై.. ‘బాలయ్య’కు నై!

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో చేసిన 'అన్‌స్టాపబుల్' షో కి ప్రేక్షకులు బ్రహ్మరంథం పట్టిన సంగతి తెలిసిందే. బాలయ్య తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ హోస్ట్ గా ఈ షో చేశారు. 'అన్‌స్టాపబుల్' షో..

  • Author : Balu J Date : 10-02-2022 - 11:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiru And Balaiah
Chiru And Balaiah

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో కి ప్రేక్షకులు బ్రహ్మరంథం పట్టిన సంగతి తెలిసిందే. బాలయ్య తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ హోస్ట్ గా ఈ షో చేశారు. ‘అన్‌స్టాపబుల్’ షో.. ఇంటర్ నెట్ మూవీ డేటా బేస్ లోనూ టాప్ త్రీలో నిలించింది. దీన్ని బట్టే మనం అర్దం చేసుకోవచ్చు బాలయ్య టాక్ షోకి ఎంత ఆదరణ దక్కిందో అనేది. ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ సెలబ్రెటీలను పిలిచి, వారిని ఇంటర్వ్యూ చేశారు బాలయ్య. షో కి వచ్చిన వారిని, వారివారి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ప్రశ్నలు సంధిస్తూ… బాలకృష్ణ తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలానే మరోపక్క కామెడీని కూడా పండించారు. అంతలా బాలయ్య బాబు తన మార్క్ ను చూపించారు.

ఇకపోతే, ‘అన్‌స్టాపబుల్’ సీజన్ వన్ ముగిసింది. చివరిగా మహేష్ బాబు ఇంటర్వ్యూ తో ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో సీజన్ వన్ ను ముగించారు. ఈ క్రమంలో ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2 ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేయాలని నిర్మాత అల్లు అరవింద్ డిసైడ్ అయ్యారని టాక్. అందులో భాగంగానే రెండో సీజన్ ను బాలకృష్ణ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి చేత చేయించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి హోస్ట్ గా చేస్తే అన్ స్టాపబుల్ సీజన్ 2 కు మరింత క్రేజ్ వస్తుందని అల్లు అరవింద్ భావిస్తున్నారట. ఒకవేళ చిరు గనుక ఓకే అంటే… వెంటనే నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, సుమన్, ప్రభాస్ లాంటి హీరోలతో పాటు ప్రముఖ టాప్ డైరెక్టర్లను సీజన్ టూ లోకి తీసుకు రావడానికి ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. “అన్‌స్టాపబుల్” సీజన్ వన్ లోనే బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న సమయంలోనే, చిరంజీవితో ఒక ఎపిసోడ్ ప్లాన్ చేశారట. కాకపోతే అదే సమయంలో బాలకృష్ణ భుజానికి గాయం కావడం… మరోవైపు అదే టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి సైతం బిజీ కావడంతో… ఆ ఎపిసోడ్ కుదరలేదట. ఒకవేళ అదే గనుక కుదిరి, చిరంజీవి గెస్ట్ గా వచ్చి ఉంటే… ‘అన్‌స్టాపబుల్’ సీజన్ వన్ కే హైలైట్ గా ఆ ఎపిసోడ్ నిలిచేదని అనుకుంటున్నారు.

ఇకపోతే ‘అన్‌స్టాపబుల్’ సీజన్ వన్ లో బాలకృష్ణ పేరుకు తగ్గట్టు తనదైన శైలిలో ఆద్యంతం టాక్ షోను రక్తి కట్టించారు. బాగా సక్సెస్ కూడా అయింది. మరి ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2 లో చిరంజీవి ని హోస్ట్ గా తీసుకుంటే… అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అన్నది చూడాలి. కాకపోతే ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2 కోసం మెగాస్టార్ ను హోస్ట్ గా తీసుకోవాలని నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని టాక్ మాత్రమే నడుస్తోంది. అందులో ఎంత నిజముందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balaiah
  • chiranjeevi
  • talk show
  • unstable

Related News

Chiranjeevi Casting Couch

కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన లేడీ సింగర్

"నేను ఎవరినీ నన్ను వేధించమని అడగలేదు, కానీ లిరిసిస్ట్ వైరముత్తు నన్ను వేధించారు" అని తన వ్యక్తిగత అనుభవాన్ని ఉదాహరణగా చూపుతూ, పరిశ్రమ అందరికీ సమానంగా ఉండే 'అద్దం' కాదని ఆమె వాదించారు. చిరంజీవి తరం నాటి మహిళా ఆర్టిస్టులకు గౌరవం లభించి ఉండవచ్చు కానీ, ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆమె గుర్తు చేశారు.

  • Msvg 10days Collections

    ఇప్పటివరకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఎంతంటే?

  • Chiranjeevi- Prabhas

    స్పిరిట్‌లో మెగాస్టార్‌.. ప్ర‌భాస్ తండ్రిగా చిరంజీవి ఫైన‌ల్‌?!

  • Chranjeevi Castingcouch

    కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి కీలక వ్యాఖ్యలు

  • Chiranjeevi's Royal Gift Ra

    అనిల్ రావిపూడికి మెగా ‘రేంజ్ ‘ గిఫ్ట్

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd