HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ukranian Beauty Maria Ryaboshapka To Be The Heroine In Sivakarthikeyan Anudeep Kv Svc Llp Suresh Productions

Ukranian Beauty: టాలీవుడ్ హీరోయిన్ గా ‘ఉక్రేనియన్’ బ్యూటీ 

ప్రముఖ హీరో శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేస్తున్నాడు. `జాతి రత్నాలు` బ్లాక్బస్టర్ విజయం సాధించిన తర్వాత ప్రముఖ దర్శకులలో ఒకరిగా మారారు అనుదీప్.

  • By Balu J Published Date - 12:43 PM, Tue - 22 March 22
  • daily-hunt
Ukrain Beauty
Ukrain Beauty

ప్రముఖ హీరో శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేస్తున్నాడు. `జాతి రత్నాలు` బ్లాక్బస్టర్ విజయం సాధించిన తర్వాత ప్రముఖ దర్శకులలో ఒకరిగా మారారు అనుదీప్. తెలుగులో ఇటీవలే `వరుణ్ డాక్టర్`తో విజయం పొందిన శివకార్తికేయన్ కోసం సక్సెస్ ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశాడు. ఈ చిత్రంలో కథానాయికగా ఉక్రేనియన్ నటి మరియా ర్యాబోషప్క ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు సోమవారంనాడు ప్రకటించాయి. ఆమె ఇప్పటికే రెండు ఉక్రేనియన్ సినిమాల్లో నటించింది. అంతేకాక ప్రసిద్ధ భారతీయ వెబ్-సిరీస్ స్పెషల్ ఆప్స్లో ప్రధాన పాత్ర పోషించింది. మరియాకు సంబంధించి నేడు విడుదల చేసిన పోస్టర్ లో అందంగా కనిపిస్తోంది.

ఈ చిత్రం శివకార్తికేయన్ కు 20వ చిత్రం. #SK20 విభిన్నమైన కాన్సెప్ట్ తో కూడిన వినోదభరితమైన రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందబోతోంది. ఈ చిత్ర కథ బ్యాక్ డ్రాప్ పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్ ల పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాత.

తారాగణం: శివకార్తికేయన్, సత్యరాజ్, మరియా ర్యాబోషప్క

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: అనుదీప్ కె.వి
సంగీత దర్శకుడు: ఎస్. ఎస్. థమన్
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్
సహ నిర్మాత: అరుణ్ విశ్వ
PRO: వంశీ-శేఖర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anudeep
  • latest tollywood news
  • Maria Ryaboshapka
  • ukraine

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd