Sankranthi Release : సంక్రాంతి నుంచి ఆ సినిమాలు డ్రాప్..!
Sankranthi Release టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఎప్పటిలానే ఈసారి సంక్రాంతికి స్టార్ సినిమాల మధ్య ఫైట్ ఓ రేంజ్ లో
- Author : Ramesh
Date : 02-01-2024 - 3:43 IST
Published By : Hashtagu Telugu Desk
Sankranthi Release టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఎప్పటిలానే ఈసారి సంక్రాంతికి స్టార్ సినిమాల మధ్య ఫైట్ ఓ రేంజ్ లో ఉండబోతుంది. ఈసారి స్టార్స్ అంతా కూడా ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టుగా తమ సినిమాలతో వస్తున్నారు.
సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ, రవితేజ ఈగల్ తో వస్తుండగా హనుమాన్ సినిమా కూడా వీటితో పోటీ పడుతుంది. ఈ ఐదు సినిమాల మధ్య గట్టి పోటీ జరుగుతుంది. తెలుగు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాలకు థియేటర్లను కేటాయించడానికి ఇబ్బందులు పడుతున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఇదిలాఉంటే సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్న రెండు సినిమాలను వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఏ సినిమాలు వాయిదా పడుతున్నాయి అంటే అవి తెలుగు సినిమాలు కాదు తమిళ సినిమాలని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ నటించిన అయలాన్.. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు.
తమిళంలో పొంగల్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. కానీ సంక్రాంతికి తెలుగు సినిమాలకే థియేటర్లు దొరకని పరిస్థితి అందుకే ఈ రెండు తమిళ సినిమాల తెలుగు వెర్షన్ ను రిలీజ్ వాయిదా వేస్తున్నారు.
కెప్టెన్ మిల్లర్ సినిమాను అరుణ్ మథేశ్వరన్ డైరెక్ట్ చేయగా అయలాన్ సినిమాను రవికుమార్ డైరెక్ట్ చేశారు. ఈ రెండు సినిమాలు ముందు తమిళ వెర్షన్ రిలీజై ఆ తర్వాత తెలుగులో రిలీజ్ అవుతాయి.
Also Read : Ariana Glamour Show : అరియానా గ్లామర్ షో వెనక కారణాలు ఏంటో..?