Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’తో వస్తున్న వెంకటేష్
Adarsha Kutumbam : చిత్రసీమలో ఫ్యామిలీ స్టార్ ఎవరంటే వెంకటేష్ అని ఎవర్ని అడిగిన చెపుతారు. ముఖ్యంగా వి వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు
- Author : Sudheer
Date : 10-12-2025 - 11:19 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్రసీమలో ఫ్యామిలీ స్టార్ ఎవరంటే వెంకటేష్ అని ఎవర్ని అడిగిన చెపుతారు. ముఖ్యంగా వి వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. గతంలో వీరిద్దరి కలయికలో ‘నువ్వు నాకు నచ్చవ్’, ‘మల్లీశ్వరి’, వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. కాకపోతే వాటికీ రచయితగా త్రివిక్రమ్ పని చేసినప్పటికీ, దర్శకుడిగా ఇప్పుడు వీరిద్దరూ కలయిక లో సినిమా రాబోతుంది.ఈ సినిమా ప్రకటన జరిగినప్పటి నుంచే టైటిల్ మరియు కథాంశంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. అనేక ఊహాజనిత టైటిల్స్‌కు చెక్ పెడుతూ, తాజాగా మేకర్స్ ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్‌తో పాటు ఫైనల్ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి “ఆదర్శ కుటుంబం” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్ పూర్తిగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ, వెంకీ మామ ఫ్యామిలీ హీరో ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Kids Health: చిన్నపిల్లలకు దగ్గు జలుబు ఉన్నప్పుడు అరటిపండు పెట్టకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్‌తో పాటు, మేకర్స్ జోడించిన ఒక చిన్న ట్యాగ్ లైన్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. అదేమిటంటే టైటిల్‌లో “హోమ్ నెంబర్ 47 – ఏకే 47” అనే ఉపశీర్షికను జోడించారు. ఈ చిన్నపాటి జోడింపు, పూర్తి ఫ్యామిలీ టచ్ ఉన్న కథకు ఏదైనా యాక్షన్ లేదా ఉత్కంఠభరితమైన అంశం జోడించబడిందా అనే కుతూహలాన్ని పెంచుతోంది. విడుదలైన ఫస్ట్ లుక్‌లో వెంకటేశ్ లుక్ చాలా ఫ్రెష్‌గా, క్లాస్ అండ్ ఫ్యామిలీ టచ్‌తో కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వెంకటేశ్ కెరీర్‌లో ఇది 77వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. నిర్మాతలు అధికారికంగా షూటింగ్ మొదలైనట్లు ప్రకటించి, సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు.
ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ కొత్త కాంబినేషన్ ప్రేక్షకులకు తాజా అనుభూతిని ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటేనే బలమైన సంభాషణలు (డైలాగ్స్), కుటుంబ విలువలు, మరియు చక్కటి వినోదం సమపాళ్లలో ఉంటాయని సినీ అభిమానుల్లో నమ్మకం ఉంది. అటువంటి బలమైన కథా నేపథ్యం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న వెంకటేశ్ నటనతో కలగలిస్తే, ఈ చిత్రం ఒక బలమైన ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా నిలబడవచ్చు. గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి విజయంతో ఫ్యామిలీ సెగ్మెంట్‌లో తన పట్టును నిరూపించుకున్న వెంకీ మామ, ‘ఆదర్శ కుటుంబం’ ద్వారా త్రివిక్రమ్ మార్క్ కథతో మరో పెద్ద విజయాన్ని అందుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
Presenting #VenkateshXTrivikram as “Aadarsha Kutumbam House No: 47 – AK 47”🏠🔥
Shoot begins today 🤗
In cinemas, Summer 2026 ♥️✨#AK47 | #AadarshaKutumbam | #Venky77 | #Trivikram @SrinidhiShetty7 #SRadhaKrishna @haarikahassine pic.twitter.com/pdtl4wh3ro— Venkatesh Daggubati (@VenkyMama) December 10, 2025