Trivikram Son Rishie : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న త్రివిక్రం వారసుడి ఫోటో.. డిటో గురూజీ అంటూ కామెంట్స్..!
Trivikram Son Rishie మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ ఈమధ్య తన వైఫ్ సౌజన్యని నిర్మాతగా మార్చి వరుస సినిమాలు ప్రొడ్యూస్ చేయిస్తున్నారు.
- By Ramesh Published Date - 09:53 PM, Sat - 21 October 23

Trivikram Son Rishie మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ ఈమధ్య తన వైఫ్ సౌజన్యని నిర్మాతగా మార్చి వరుస సినిమాలు ప్రొడ్యూస్ చేయిస్తున్నారు. సితార బ్యానర్ తో కలిసి ఫార్చ్యున్ ఫోర్ బ్యానర్ లో సౌజన్య నిర్మాతగా కొనసాగుతున్నారు. త్రివిక్రం సౌజన్యలకు ఒక కొడుకు ఉన్నాడని అతను టీనేజ్ లో ఉన్నాడని ఎవరికి తెలియదు. లేటెస్ట్ గా త్రివిక్రం వారసుడి ఫోటో ఒకటి సోషల్ మీడియాకు లీక్ అయ్యింది. లీక్ అవడం అంటే త్రివిక్రం రిలేటివ్ నటుడు రాజు ఈ ఫోటోని తన సోషల్ మీడియాలో పెట్టాడు.
రాజు, సౌజన్య(Sowjanya) తో పాటుగా ఫ్లైట్ లో త్రివిక్రం (Trivikram) తనయుడు రిషి కూడా ఉన్నాడు. అచ్చం త్రివిక్రం యంగ్ ఏజ్ లో ఎలా ఉన్నాడో అతను కూడా అలానే ఉన్నాడు. త్రివిక్రం వారసుడు రిషి (Rishie) మనోజ్ కి డైరెక్షన్ అంటే ఇష్టమని టాక్. అతను ఎప్పటికైనా సరే డైరెక్టర్ అవుతాడని చెబుతున్నారు. ఎప్పుడు కూడా త్రివిక్రం తనయుడి ఫోటో బయటకు రాలేదు. కానీ రిషి ఫోటో ఇవాల ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైరల్ గా మారింది.
Also Read : Comedian Ali : అలీ ‘చాట’ డైలాగ్ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా..?
అయితే త్రివిక్రం కొడుకు డైరెక్షన్ ఎందుకు హీరోగా చేయొచ్చు కదా అని అనుకునే వాళ్లు ఉన్నారు. కానీ అతను మాత్రం తండ్రి బాటలోనే మెగా ఫోన్ పట్టాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే త్రివిక్రం సినిమాలకు అతను పనిచేస్తున్నాడని తెలుస్తుంది. మరి త్రివిక్రం తనయుడిని అతను ఎప్పుడు డైరెక్ట్ గా ఆడియన్స్ కు పరిచయం చేస్తాడో చూడాలి.
ఇక సినిమాల విషయానికి వస్తే త్రివిక్రం మహేష్ (Mahesh Babu) తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ లాక్ చేశారు. మహేష్ తో ఆల్రెడీ రెండు సినిమాలు చేసిన త్రివిక్రం గుంటూరు కారంతో హ్యాట్రిక్ చేస్తున్నాడు.