Trisha : త్రిష డిమాండ్ కి నిర్మాతలు మైండ్ బ్లాక్..!
Trisha కోలీవుడ్ అందాల భామ త్రిష డిమాండ్ సినిమా సినిమాకు పెరుగుతుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు
- By Ramesh Published Date - 04:43 PM, Thu - 16 November 23

Trisha కోలీవుడ్ అందాల భామ త్రిష డిమాండ్ సినిమా సినిమాకు పెరుగుతుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు అప్పటి నుంచి ఇప్పటికీ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది. త్రిష రీసెంట్ మూవీస్ P.S 1, 2 దళపతి విజయ్ తో చేసిన లియో ఆమె మైలేజ్ మరింత పెరిగేలా చేశాయి. లియో సినిమాలో త్రిష ని చూసి ఇంప్రెస్ అవ్వని వారు ఉండరు. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ రెట్టింపు అందంతో కనిపిస్తుంది త్రిష.
త్రిష బ్యూటీ సీక్రెట్ ఏంటో కానీ అమ్మడి స్క్రీన్ ప్రెజన్స్ ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలోనే కమల్ హాసన్ నెక్స్ట్ సినిమాలో నటిస్తున్న త్రిష అజిత్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలకు గాను త్రిష భారీ రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్.
లియో ముందు వరకు 2,3 లక్షల దాకా ఉన్న త్రిష రెమ్యునరేషన్ ఇప్పుడు 5 నుంచి 10 కోట్ల దాకా వెళ్లిందని టాక్. త్రిష కావాలని పెంచలేదు. తనకు ఉన్న ఈ డిమాండ్ మేరకు ఈ రెమ్యునరేషన్ అడిగేస్తుంది. కోలీవుడ్ లో నయనతార మాత్రమే స్టార్స్ కు ఈక్వల్ గా రెమ్యునరేషన్ అందుకుంది. ఇక ఇప్పుడు అదే దారిలో త్రిష కూడా పారితోషికం తో షాక్ ఇస్తుంది.
బాలకృష్ణ బాబీ కాంబో సినిమాలో త్రిషని సెలెక్ట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. చిత్ర యూనిట్ మాత్రం ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. త్రిష తో బాలయ్య సినిమా కన్ ఫర్మ్ అయితే తెలుగులో కూడా అమ్మడి సక్సెస్ మేనియా కొనసాగించే ఛాన్స్ ఉంటుంది.
Also Read : Bigg Boss 7 : ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నది ఎవరు.. ఇక్కడ కూడా బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి..?
We’re now on WhatsApp : Click to Join